Waltair Veerayya OTT: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తూనే ఉంది..ఓటీటీ కాలం లో ఒక సినిమాకి ఈ రేంజ్ రన్ ఉంటుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండకపోవచ్చు..అదే మెగాస్టార్ మ్యాజిక్ అంటే..ఈ జెనెరేషన్ స్టార్ హీరోలకు ఈ రేంజ్ క్రౌడ్ పుల్ కెపాసిటీ ఉంటుందా అంటే ‘అది అంత సామాన్యమైన విషయం కాదు’ అంటున్నారు విశ్లేషకులు.

చిరంజీవి లాంటి పూర్తి స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవ్వరూ లేరని..ఏ స్టార్ హీరోకి అయిన ఒక సెక్షన్ ఆడియన్స్ మాత్రమే అభిమానులుగా ఉంటారని..కానీ అన్ని రకాల ఆడియన్స్ కి కింగ్ ఒక్క మెగాస్టార్ మాత్రమేనని..అందుకే ఆయన సినిమాలకు హిట్ టాక్ వస్తే కలెక్షన్ల సునామి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో ఎవ్వరూ ఊహించలేరంటున్నారు విశ్లేషకులు.
థియేట్రికల్ పరంగా బ్లాక్ బస్టర్ రన్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీ లో విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు..అలా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు ఒక శుభవార్త..ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్స్ కి కొనుగోలు చేసారు..ఒప్పందం ప్రకారమే ఈ చిత్రాన్ని ఈ నెల 25 వ తారీఖున స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టు సమాచారం..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనుంది నెట్ ఫ్లిక్స్ సంస్థ.

మరి థియేటర్స్ లో ఇంత అద్భుతంగా రన్ అయ్యి, సుమారు 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , ఓటీటీ ఆడియన్స్ ని కూడా అదే రేంజ్ లో అలరిస్తుందో లేదో చూడాలి..చాలా వరకు థియేటర్స్ లో సక్సెస్ అయిన సినిమాలు ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మిశ్రమ స్పందన అందుకున్నాయి..’వాల్తేరు వీరయ్య’ కూడా అదే కోవకి చెందుతుందా, లేదా ఓటీటీ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంటుందా అనేది చూడాలి.