
Chiranjeevi- Director Srikanth Odela: రీసెంట్ గా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన సినిమా ‘దసరా’.న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ఈ సినిమా ఆయన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమైంది.తెలుగు తో పాటుగా హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో ఈ సినిమాని మార్చి 30 వ తారీఖున ఘనంగా విడుదల చేసారు.రెస్పాన్స్ మామూలు రేంజ్ లో రాలేదు.
వారం లోపే 50 కోట్ల రూపాయిల షేర్ మార్కు ని దాటి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది, అలాంటి షాట్స్ ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ డైరెక్టర్ కూడా అలోచించి పెట్టలేదు.అలాంటి ఆలోచనలు వచ్చినందుకు డైరెక్టర్ శ్రీకాంత్ కి మా సెల్యూట్ అంటూ ట్విట్టర్ లో నెటిజెన్స్ దగ్గర నుండి సెలెబ్రిటీల వరకు మెచ్చుకున్నారు.
అయితే దర్శకుడి టాలెంట్ ని గుర్తించడం లో ఎప్పుడూ ముందు ఉండే మెగాస్టార్ చిరంజీవి,ఈ సినిమాకి కూడా మూవీ టీం మొత్తానికి కాల్ చేసి శుభాకాంక్షలు తెలియజేసాడట.ముఖ్యంగా డైరెక్టర్ శ్రీకాంత్ కి ఫోన్ చేసి అతనిని పొగడ్తలతో ముంచి ఎత్తేసాడట, అప్పుడు శ్రీకాంత్ నా దగ్గర మీకోసం మంచి కథ ఉంది అన్నయ్యా, అవకాశం ఇస్తే ఇప్పుడే వచ్చి చెప్తాను అన్నాడట.చిరంజీవి వెంటనే ఇంటికి రమ్మంటే అక్కడకి వెళ్లి కథని వినిపించాడట డైరెక్టర్.

సుమారు మూడు గంటల పాటు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథని ఓపికగా, ఎంతో ఆసక్తితో విన్నాడట.ఇక ఆ తర్వాత వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాము అని శ్రీకాంత్ కి చెప్పాడట మెగాస్టార్.ప్రస్తుతం భోళా శంకర్ సినిమా చేస్తున్న చిరంజీవి,ఈ సినిమా అయిపోగానే శ్రీకాంత్ ఓదెల తో చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.నాని ని ఊర మాస్ అవతారం లో చూపించి ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచిన శ్రీకాంత్ మెగాస్టార్ ని ఎలాంటి అవతారం లో చూపించబోతున్నాడో చూడాలి.