Mega Family Christmas : మెగా ఫ్యామిలీ ఒక చోట చేరితే ఆ ఫ్రేమ్ అదిరిపోతుంది. స్టార్స్ నుండి టైర్ టు హీరోల వరకు ఇండస్ట్రీ మొత్తం ఆ ఇంట్లోనే ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ టాప్ హీరోలుగా పరిశ్రమను ఏలుతున్నారు. ఇక సాయి ధరమ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ టైర్ టు హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఇక పండగలు, పబ్బాలు, ప్రత్యేక దినాల్లో ఒకచోట చేరడం మెగా ఫ్యామిలీ ఆచారం.
తాజాగా క్రిస్మస్ వేడుకల కోసం అందరూ కలిశారు. మెగా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, ఉపాసన, స్నేహారెడ్డి, నిహారిక, శ్రీజతో పాటు దాదాపు ఆ ఫ్యామిలీ యూత్ మొత్తం కలిసి క్రిస్మస్ సెలెబ్రేట్ చేసుకున్నారు. వీరి క్రిస్మస్ వేడుకల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
గ్రూప్ ఫోటోలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఒకరంటే మరొకరికి పడటం లేదనే వాదన ఉంది. ఈ అనుమానాలకు పలు సంఘటనలు కారణం అయ్యాయి. అల్లు అరవింద్, చిరంజీవి ఈ పుకార్లను ఖండించారు. కాగా గత రాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో చరణ్, బన్నీ సన్నిహితంగా కనిపించారు. గ్రూప్ ఫోటోలో పక్క పక్కనే నిల్చున్నారు.
#PrashantNeel : ఆయన్ని మార్చమని ప్రశాంత్ నీల్ కి మెసేజ్ లు పెడుతున్న ఎన్టీయార్ అభిమానులు
View this post on Instagram
ఇది మెగా ఫ్యాన్స్ అందరినీ ఆకర్షించింది. ఇక ఈ క్రిస్మస్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పెద్దవాళ్ళు ఎవరూ లేరు. అందరూ సెకండ్ జనరేషన్ కిడ్స్ మాత్రమే ఉన్నారు. ఉపాసన-నమ్రత కలిసి ఒక పార్టీ చేసుకున్నారు. ఈ క్రిస్మస్ పార్టీకి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. అయితే రామ్ చరణ్, మహేష్ బాబు ఈ పార్టీలో కనిపించలేదు. మహేష్ పిల్లలు గౌతమ్, సితార సైతం పాల్గొన్నారు. నమ్రత క్రిస్మస్ వేడుకల ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.
View this post on Instagram