Homeఎంటర్టైన్మెంట్Mechanic Rocky Movie Review: 'మెకానిక్ రాఖీ' ఫుల్ మూవీ రివ్యూ...

Mechanic Rocky Movie Review: ‘మెకానిక్ రాఖీ’ ఫుల్ మూవీ రివ్యూ…

Mechanic Rocky Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన నుంచి వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ సక్సెస్ గా నిలుస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఏర్పడుతున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈరోజు ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే విశ్వక్ సేన్ వాళ్ళ నాన్న ఆర్ కే గ్యారేజ్ ను ఆక్రమించుకోవాలని కొంతమంది చూస్తూ ఉంటారు. అయితే వాళ్ల నుంచి ఆ గ్యారేజ్ ని ఎలా కాపాడాడు. ఆ గ్యారేజీకి వాళ్ళ నాన్నకి మధ్య ఉన్న ఎమోషన్ ఏంటి మొత్తానికైతే గ్యారేజ్ ని తను కాపాడుకున్నాడా లేదా ఇతరులు ఆక్రమించుకున్నారా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ రవితేజ ఈ సినిమాని మొదటి నుంచి చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లాలనే ప్రయత్నం అయితే చేశాడు. కానీ అవి ఏమాత్రం ఫలించలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోరింగ్ గా సాగుతుంది. హీరో ఏం చేస్తున్నాడు? కథ ఎటు వెళుతుంది అనే విషయంలో కూడా ప్రతి ప్రేక్షకుడికి ఒక డైలమా అయితే ఉంటుంది. ఇక ఇంటర్వెల్ అయ్యే సరికి ఏం జరుగుతుందో కూడా సినిమా చూసే ప్రేక్షకుడికి అసలేం అర్థం అవ్వదు. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని చాలా డీటెయిల్ గా రాసుకోవడమే కాకుండా ఫస్ట్ హాఫ్ లో సెట్ చేసిన సెటప్ కి సెకండాఫ్ లో సరైన పే ఆఫ్ కూడా ఇచ్చాడు. ఇక ఏది ఏమైనా కూడా సెకండాఫ్ లో ఇచ్చిన పే హాఫ్ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి.

మొత్తానికైతే ఈ సినిమాని ఫస్ట్ ఆఫ్ స్లో నరేషన్ తో నడిపించినప్పటికి సెకండాఫ్ మాత్రం ఫాస్ట్ గా నడిపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక దానికి తగ్గట్టుగానే టామ్ అండ్ జెర్రీ వార్ లాగా హీరో విలన్ కి మధ్య పోటాపోటీ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక స్క్రీన్ ప్లే లో కూడా వైవిధ్యతను ప్రదర్శించిన దర్శకుడు సెకండాఫ్ మొత్తం చాలా ఎంగేజింగ్ గా రాసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ను మినహాయిస్తే సెకండ్ హాఫ్ మాత్రమే చాలా ఎక్స్ప్రాడినరీగా ఉంటుంది…ఇక కొన్ని ఎలివేషన్ సీన్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా వరకు హెల్ప్ అయింది…

ఫస్ట్ ఆఫ్ కి సెకండ్ హాఫ్ కి మధ్య ఇంత వేరియేషన్ చూపించిన దర్శకుడు మీద సినిమా అయిపోయిన తర్వాత ఒక రెస్పెక్ట్ అయితే పెరుగుతుంది. మొత్తానికైతే సినిమాలో సెకండ్ హాఫ్ మాత్రమే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండటం అనేది ఈ సినిమాకి కొంతవరకు కలిసొచ్చే అంశం అయితే ఫస్ట్ ఆఫ్ అంత ఎంగేజింగ్ లేకపోవడం అనేది సినిమాకి భారీగా మైనస్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి… ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సినిమాను తీసి మెప్పించగలిగే సత్తా ఉన్న దర్శకుడి గా రవితేజ కి మంచి మార్కులు అయితే పడ్డాయి…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ మొదటి నుంచి చివరి వరకు వన్ మ్యాన్ షో చేశారనే చెప్పాలి. ప్రతి సీన్ లో తనదైన రీతిలో నటించి మెప్పించడమే కాకుండా సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడిలో ఒక ఇంటెన్స్ డ్రామాని క్రియేట్ చేయడంలో కూడా తను చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక అలాగే హీరోయిన్స్ అయిన శ్రద్ధ శ్రీనాథ్, మీనాక్షి చౌదరి వాళ్ళ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించి మెప్పించారనే చెప్పాలి.

ఇక సునీల్ తన దైన రీతిలో నటించడమే కాకుండా విలనిజాన్ని కూడా పండించి ప్రేక్షకులచేత శభాష్ అనిపించుకున్నాడు. పుష్ప సినిమాలో మంగళం శ్రీను క్యారెక్టర్ తర్వాత ఈ క్యారెక్టర్ తో తను మెప్పించడం అనేది సునీల్ కెరీర్ కి చాలా వరకు హెల్ప్ అయ్యే విషయమనే చెప్పాలి. ఇక మిగిలిన ఆర్టీస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ మాత్రం సో సో గా అనిపించినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ లో మాత్రం తనదైన రీతిలో సినిమాలోని సీన్స్ ను ఎలివేట్ అయ్యేలా చేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ రివిలింగ్ సీన్ లో అతను అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందనే చెప్పాలి… ఇక సినిమాటోగ్రాఫర్ కూడా తన సినిమాటిక్ విజువల్స్ ని అందించడంలో చాలావరకు కృషి చేశాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాని సక్సెస్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ కీలక పాత్ర వహించాడనే చెప్పాలి… ఎడిటర్ ఫస్ట్ ఆఫ్ లో కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. మరీ ఇంత లాగ్ అయ్యేది కాదు. ఇక ఇది మినహాయిస్తే ఎడిటర్ కూడా తన బాధ్యతను పూర్తిగా నిర్వహించాడనే చెప్పాలి…

ప్లస్ పాయింట్స్

విశ్వక్ సేన్ యాక్టింగ్
సెకండాఫ్
ట్విస్ట్ లు

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ బోరింగ్ సీన్స్
సాంగ్స్
కొన్ని అనవసరపు సీన్స్…

రేటింగ్

ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

చివరి లైన్

విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ గా బాగా సెట్ అయ్యాడు…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular