https://oktelugu.com/

Mandous Cyclone: తీరందాటిన తుఫాన్.. భారీ వర్షాలతో అల్లకల్లోలం.. వణుకుతున్న ప్రజలు

Mandous Cyclone: మాండూస్ తుఫాన్ తీరం దాటింది. రాత్రి 1.30 గంటల సమయంలో పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహా బలిపురం సమీపంలో తుఫాను తీరం దాటినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రానికి వాయుగుండం బలహీనపడే అవకాశముంది. తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తుపాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు. రేపు కూడా అతి తేలిక వర్షాలు పడే అవకాశముందని చెబుతున్నారు. […]

Written By:
  • Dharma
  • , Updated On : December 10, 2022 / 09:51 AM IST
    Follow us on

    Mandous Cyclone: మాండూస్ తుఫాన్ తీరం దాటింది. రాత్రి 1.30 గంటల సమయంలో పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహా బలిపురం సమీపంలో తుఫాను తీరం దాటినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రానికి వాయుగుండం బలహీనపడే అవకాశముంది. తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తుపాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు. రేపు కూడా అతి తేలిక వర్షాలు పడే అవకాశముందని చెబుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు. -కాగా తుఫాను ప్రభావంతో తీరం వెంబడి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. చాలా జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. చలి తీవ్రత పెరిగింది.పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. అత్యధికంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం లో 125 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో 114 మిల్లీమీటర్ల వర్షం పడింది. నేడు దక్షణ కోస్తాతో పాటు ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

    Mandous Cyclone

    తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురంతో పాటు పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రతాపం చూపాయి. 26 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఇటు ఏపీలో కూడా ఆ మూడు జిల్లాలపై తుపాను పెను ప్రభావమే సృష్టించింది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచే వర్షాలు పడుతున్నాయి. రేపు కొనసాగనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు కంటమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. తుపాను హెచ్చరికలతో నెల్లూరు జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ మత్స్యకారులు తీరానికే పరిమితమయ్యారు. దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఏపీలో లక్షలాది మంది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. తుపాను హెచ్చిరికలు వచ్చిన ప్రతీసారి వారం రోజుల పాటు వేటకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Mandous Cyclone

    భారీ వర్షాలతో పంటలకు అపార నష్టం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ లో వేసుకున్న వరి కోతలుముమ్మరంగా సాగుతున్నాయి. నూర్పులు చేసి రైతులు ధాన్యాన్ని కల్లాలకు చేర్చుతున్నారు. ఇటువంటి సమయంలో వర్షాలు పడడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏడాది పొడవునా పండించుకున్న పంట చేతికందే సమయానికి నష్టాల పాలైంది. అటు రబీలో వేసుకున్న వాణిజ్య పంటలకు వర్షం మేలుచేస్తోందని అధికారులు చెబుతున్నా… పొగ మంచుతో కూడిన గాలులతో నష్టమేనని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావం, మధ్యలో చీడపీడలు పంటలను దారుణంగా దెబ్బతీశాయి. ఎలాగోలా పంటను పండిస్తే మాండూస్ తుఫాన్ మరోసారి పంజా విసిరింది. రైతులకు అపార నష్టం మిగిల్చింది.

    Tags