Manchu Manoj- Sai Dharam Tej: విరూపాక్ష మూవీ విజయపధంలో దూసుకువెళుతుంది. ఇటీవల విడుదలైన చిత్రాలన్నీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో విరూపాక్షకు ప్లస్ అయ్యింది. ఈ మూవీ వంద కోట్ల వసూళ్ల వైపుగా పరుగులు పెడుతుంది. కొత్త దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సస్పెన్సు థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. చెప్పాలంటే విరూపాక్ష మీద పెద్దగా అంచనాలు లేవు. కేవలం కంటెంట్ ఆధారంగా ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తుంది.
ఈ చిత్ర విజయం సాయి ధరమ్ తేజ్ కి చాలా అవసరం. ప్రతిరోజూ పండగే మూవీ తర్వాత ఆయనకు హిట్ లేదు. అందులోనూ బైక్ ప్రమాదం కారణంగా ఏడాది పాటు పరిశ్రమకు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత చేసిన మొదటి చిత్రం విరూపాక్ష విజయం సాధించింది. ఆయన మరలా ట్రాక్ లో పడినట్లు అయ్యింది. విరూపాక్ష మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు. తెలుగులో వరుసగా ఆమెకు ఇది నాలుగో హిట్ అని చెప్పాలి.
విరూపాక్ష విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ కి మంచు మనోజ్ పార్టీ ఇచ్చారు. తన నివాసంలో స్పెషల్ గా బిర్యానీ చేయించి విందు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ బిర్యానీని నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ ప్రిపేర్ చేశాడట. ఫొటోల్లో సాయి ధరమ్ తేజ్ తో పాటు నవీన్ కృష్ణ కూడా ఉన్నారు. మనోజ్ తన నివాసంలో ఈ పార్టీ ఇవ్వడం జరిగింది.
కాగా మనోజ్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. భూమా మౌనికతో ఆయన పెళ్లి జరిగింది. పెద్దలను ఎదిరించి మనోజ్ ఈ వివాహం చేసుకున్నారు. మంచు లక్ష్మి తన నివాసంలో మనోజ్-మౌనికల వివాహం జరిపించింది. ఇక మనోజ్ వెండితెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. ఇటీవల వాట్ ది ఫిష్ టైటిల్ తో మూవీ ప్రకటించారు. అలాగే రెండు మూడు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు తెలియజేశారు.
Had a super cooking session with my brothers today at my new home. ❤️#NawinVijayKrishna cooked the best biryani ever 😍 ❤️🙏🏼 @BiryaniTimes'#Ranjith butter chicken is pure delight to eat. 😋@IamSaiDharamTej babai congratulations once again for the blockbuster #Virupaksha ❤️ pic.twitter.com/vKxtAfelg7
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 10, 2023