https://oktelugu.com/

Kissing Device : ప్రియురాలికి గట్టిగా ముద్దు ఇవ్వడం కోసం ఇతడు ఏం చేశాడో తెలుసా?

Kissing Device : ప్రేమకు ఎల్లలు లేవు. అంతరాలు ఉండవు. ప్రేమలో పడితే మైకమే. ఏమీ తెలియదు. ప్రియురాలి కోసమే నిరంతరం తపన. ఏ బహుమతి ఇవ్వాలి. ఎలా ఇంప్రెస్ చేయాలనే తపనతోనే బతుకుతారు. నిరంతరం కలలు కంటూ ఉంటారు. ఇద్దరం ఒకటిగా ఎలా జీవించాలనే దానిపై ఎన్నో ఊసులు పంచుకుంటారు. ప్రేమ కోసం ఎందరో ప్రాణాలు త్యాగం చేసిన వారున్నారు. ప్రియురాలి కోసం తాజ్ మహల్ నిర్మించాడో చక్రవర్తి. భార్య కోసం భాగ్యనగరాన్ని నిర్మించాడు మరో చక్రవర్తి. […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 26, 2023 / 07:40 PM IST
    Follow us on

    Kissing Device : ప్రేమకు ఎల్లలు లేవు. అంతరాలు ఉండవు. ప్రేమలో పడితే మైకమే. ఏమీ తెలియదు. ప్రియురాలి కోసమే నిరంతరం తపన. ఏ బహుమతి ఇవ్వాలి. ఎలా ఇంప్రెస్ చేయాలనే తపనతోనే బతుకుతారు. నిరంతరం కలలు కంటూ ఉంటారు. ఇద్దరం ఒకటిగా ఎలా జీవించాలనే దానిపై ఎన్నో ఊసులు పంచుకుంటారు. ప్రేమ కోసం ఎందరో ప్రాణాలు త్యాగం చేసిన వారున్నారు. ప్రియురాలి కోసం తాజ్ మహల్ నిర్మించాడో చక్రవర్తి. భార్య కోసం భాగ్యనగరాన్ని నిర్మించాడు మరో చక్రవర్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమలో అనంతమైన నిర్వచనాలే వస్తాయి.

    ప్రేమలో స్వార్థం లేకపోతే అది కలకాలం నిలుస్తుంది. ఒకవేళ స్వార్థంతో ప్రేమిస్తే మాత్రం అది మధ్యలోనే ఆగిపోవడం ఖాయం. ఇలా ప్రేమ కోసం తమ జీవితాలను ఫణంగా పెట్టిన వారు ఎందరో ఉండటం గమనార్హం.

    చైనాలోని ఓ యూనివర్సిటీకి చెందిన యువకుడు తన ప్రియురాలి కోసం ఓ విషయం కనిపెట్టాడు. ప్రియురాలు ఎప్పుడు మనతోనే ఉండాలనే ఉద్దేశంతో కిస్సింగ్ డివైన్ ను తయారు చేశాడు. ఛార్జింగ్ పోర్టు ద్వారా ఈ డివైన్ ను కనెక్ట్ చేసి యాప్ ద్వారా వీడియో కాల్స్ తో ముద్దులు పెట్టుకునే వెసులుబాటు కల్పించాడు.

    దీనిలో విశేషం ఏంటంటే మనం ఎంత గాఢంగా ముద్దు పెడితే అదే రీతిలో అవతలి వారికి అందడం దాని ప్రత్యేకత. దీంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రేమికుల పాలిట ఓ స్వప్నంగా భావిస్తున్నారు.

    జియాంగ్ అనే వ్యక్తి సృష్టించిన దీనికి అనూహ్య స్పందన వస్తోంది. దీంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రేమికులకు ఇదో అద్భుతమైన మందుగా కనిపిస్తోంది. అందుకే అందరు వాడేందుకు సిద్ధపడుతున్నారు. ఒక్కరోజులోనే జియాంగ్ సెలబ్రిటీ అయిపోయాడు. ప్రేమికుల పాలిట ఆరాధ్యుడిగా నిలిచాడు.

    మనసుంటే మార్గముంటుంది అన్నట్లు మనం తలుచుకుంటే ఏదైనా కనిపెట్టడం సాధ్యమే. దానికి పట్టుదల ఉండాలి. కృషి కూడా తోడైతే చాలు మనం ఏం చేయాలన్నా చేయొచ్చు.

    ఓ దేవదాసు పార్వతి, లైలా మజ్ను, సలీం అనార్కలి వీరంతా ప్రేమ కోసం వారి జీవితాలను త్యాగం చేశారు. ప్రియురాలు బాగుండాలని తమ బతుకులను కాదనుకున్నారు. ఆ విధంగా ప్రేమను బతికించారు. అలా చరిత్రలో మనకు ఎన్నో జంటలు కనిపిస్తాయి. ప్రేమను ప్రేమించలేని వాడు ప్రేమికుడు కాడు. ప్రేమతో ప్రియురాలి ఆశలు తీర్చేవాడే నిజమైన ప్రేమికుడు. అలా ప్రియురాలి కోసం ఓ యాప్ ను తయారు చేసిన జియాంగ్ ను చైనీయులు ప్రశంసిస్తున్నారు. ప్రియురాలి కోసం అతడు చేసిన పని అందరికి ఆమోదయోగ్యంగానే నిలుస్తోంది.