https://oktelugu.com/

మహేష్ బాబు ఎంజాయ్.. మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో.. అలాగే తన కుటుంబానికి పెద్దపీట వేస్తాడు. ప్రస్తుతం తన కుటుంబంతో మహేష్ బాబు ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ మరియు వారి పిల్లలు గౌతమ్ , సీతార సెలవులు తీసుకొని హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. మహేష్ కుటుంబంతోపాటు నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్, ఆమె భర్త అప్రెష్ రంజిత్.. కుమార్తె అనౌష్కా రంజిత్ లు కలిసి వెళ్లారు. ఆమ్రేష్ పుట్టినరోజు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2020 / 08:53 AM IST
    Follow us on

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో.. అలాగే తన కుటుంబానికి పెద్దపీట వేస్తాడు. ప్రస్తుతం తన కుటుంబంతో మహేష్ బాబు ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ మరియు వారి పిల్లలు గౌతమ్ , సీతార సెలవులు తీసుకొని హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. మహేష్ కుటుంబంతోపాటు నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్, ఆమె భర్త అప్రెష్ రంజిత్.. కుమార్తె అనౌష్కా రంజిత్ లు కలిసి వెళ్లారు. ఆమ్రేష్ పుట్టినరోజు వేడుకల వీడియోను నమ్రతా పంచుకున్నారు, ఇందులో మహేష్ బాబు మరియు ఇతర కుటుంబాన్ని ఆనందంగా పండుగను జరుపుతోకోవడం కనిపించింది..

    Also Read: అయ్యా బాబోయ్.. స్టైలీష్ స్టార్ ఇలా అయ్యాడెంటీ.. ఫ్యాన్స్ తట్టుకోగలరా?

    మహేష్ బాబు గౌతమ్‌ను కౌగిలించుకున్న ఫొటోను కూడా షేర్ చేవాడు. “ఇప్పుడు అతన్ని కౌగిలించుకోవడం చాలా కష్టం. దీనికి కారణం లేదా సరైన సమయం అవసరం లేదు. # ట్రావెల్‌డైరీస్ ” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

    విహారయాత్రకు వెళ్లేముందు మహేష్ బాబు ఒక ఫొటోను షేర్ చేసి వ్యాఖ్యానించారు. “మేం మళ్లీ కొత్త సాధారణ పరిస్థితులకు అలవాటు పడేందుకు వెళుతున్నాం. సురక్షితమైన విమాన ప్రయాణానికి సన్నద్ధమయ్యాయి. జీవితం తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది! జెట్ సెట్ గో! ” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

    Also Read: కాజల్ ముందుచూపు.. సైడ్ బిజినెస్ షూరు..!

    కరోనాకు ముందు మహేష్ బాబు చివరిసారిగా ‘సరిలేరు నీకేవరు’ చిత్రంలో కనిపించారు. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆయన తర్వాత ‘సర్కారు వారీ పాట’ లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా కనిపించనుంది. మహేష్ ఇప్పటికే కొన్ని ప్రకటనల షూటింగ్ లు చేశాడు. కాని ఇంకా సినిమా సెట్స్‌లోకి పాల్గొనలేదు. ప్రస్తుతం అమెరికాలో సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ‘సర్కారివారిపాట’ సినిమా షూటింగ్ ను అమెరికాలోనే నిర్వహించనున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    https://twitter.com/urstrulyMahesh/status/1326397159873404937?s=20