Mahesh-Rajamouli Movie
Mahesh-Rajamouli Movie: అరంగేట్రానికి ముందే మహేష్-రాజమౌళి మూవీ కాకరేపుతుంది. ఈ మూవీ గురించి ప్రచారం అవుతున్న ఒక్కో వార్త అంచనాలు ఆకాశానికి చేర్చుతున్నాయి. కెరీర్లో మొదటిసారి రాజమౌళి-మహేష్ కాంబోలో మూవీ తెరకెక్కుతుంది. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి ఇండియన్ బ్లాక్ బ్లస్టర్స్ కి కథలు సమకూర్చిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మరోసారి రంగంలోకి దిగారు. మహేష్ కోసం గత రెండేళ్లుగా ఆయన స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో రాజమౌళి మొదటిసారి మహేష్ మూవీ మీద ప్రకటన చేశారు.
నా నెక్స్ట్ మూవీ మహేష్ తో, కొన్ని స్టోరీ లైన్స్ ఉన్నాయి. తండ్రి విజయేంద్రప్రసాద్ తో కలిసి చర్చలు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. కొద్దిరోజులుగా ఇది యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అని హింట్ ఇచ్చారు. రాజమౌళి, విజయేంద్రప్రసాద్… మహేష్ తో చేయబోయే చిత్రం జంగిల్ అడ్వెంచర్. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు కథగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. తాజాగా మరింత క్లారిటీ ఇచ్చారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ సన్నిహితులతో అసలు విషయం లీక్ చేసినట్లు తెలుస్తుంది.
Mahesh-Rajamouli Movie
ఇప్పటికే జంగిల్ అడ్వెంచర్ అని చెప్పగా… మహేష్ క్యారెక్టర్ కి రామాయణంలో హనుమంతుడు పాత్ర స్ఫూర్తి అట. హనుమంతుడు క్యారెక్టర్, బలం, తెగువ, స్వామి భక్తి ఇవన్నీ మహేష్ రోల్ లో ప్రతిబింబిస్తాయట. మహేష్ సాహసాలు హనుమంతుడు వీరగాథకు దగ్గరగా ఉంటాయట. విజయేంద్ర ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగిస్తున్నాయి.
ఇక ఈ మూవీ మూడు భాగాలుగా విడుదల కానుందట. ఏకంగా పది సంవత్సరాల సమయం మహేష్-రాజమౌళి ఈ ప్రాజెక్ట్ కి కేటాయించనున్నారట. బడ్జెట్ సైతం మూడు భాగాలకు కలిపి రూ. 2000 కోట్లకు పైగా అనుకుంటున్నారట. హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట. హాలీవుడ్ యాక్టర్స్, సాంకేతిక నిపుణులు భాగం కానున్నారట. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆస్కార్ గెలుచుకున్న రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని సమాచారం.