M S Dhoni : ఐపీఎల్ లో (IPL) చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) జట్టును ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన ఘనత ధోని సొంతం. ధోని సొంత రాష్ట్రం జార్ఖండ్.. రాంచీలో ధోనికి వ్యవసాయ క్షేత్రం, సొంత గృహం ఉన్నాయి. ధోని క్రికెట్ మ్యాచ్లు, ఇతర వ్యవహారాలు లేకుంటే ఉంటే రాంచీలోని వ్యవసాయ క్షేత్రానికే పరిమితమవుతుంటారు. అక్కడ తనకు ఇష్టమైన పాటలు పండిస్తుంటాడు. ముఖ్యంగా అందులో పండిన మామిడికాయలు.. ఇతర పండ్లను తన సన్నిహితులకు కానుకలుగా ఇస్తుంటాడు. వాహనాలు నడపడం అంటే విపరీతమైన ఇష్టం ఉన్న ధోనీకి.. తన వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్ నడపడం అంటే విపరీతమైన ఇష్టం. వ్యవసాయ పనుల్లో ధోని ఎక్కువగా ట్రాక్టర్ ను ఉపయోగిస్తుంటాడు. అప్పుడప్పుడు పార, పలుగు చేత పట్టి రైతు అవతారం కూడా ఎత్తుతాడు. అందువల్లే ధోనికి కోట్లాదిమంది ప్రజల అభిమానం ఉంది. 40 సంవత్సరాల వయసులోనూ అతడు క్రికెట్ ఆడుతుంటే.. ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు. ఇటీవల కాలంలో తనకు ఇంత వయసు వచ్చినప్పటికీ చెన్నై జట్టు వదలలేదని.. చివరికి హాస్పిటల్లో వీల్ చైర్ మీద ఉన్నా సరే.. మైదానంలోకి తీసుకొచ్చి క్రికెట్ ఆడిస్తారని సరదాగా ధోని సంభాషించాడు. సంభాషణ అనే ప్రస్తావన వచ్చిన తర్వాత.. ధోనికి ఏ భాష అంటే ఇష్టం అనే ప్రశ్న ఎదురైంది.. దానికి ధోని ఏం సమాధానం చెప్పాడంటే..
Also Read : కట్టప్పలా చాహర్.. బాహుబలి లా ధోని.. వైరల్ వీడియో
హిందీ, తమిళం కాదట
ధోని(Mahendra Singh Dhoni) నివాసం ఉండే రాంచీ ప్రాంతంలో హిందీ ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఫలితంగా ధోని కి కూడా చిన్నప్పటి నుంచి హిందీ(Hindi) మాతృభాష అయింది. ఐపీఎల్ లో చెన్నై జట్టుకు(IPL Chennai team) ఆడుతున్నాడు కాబట్టి.. ధోనికి తమిళం(Tamil)లో విపరీతమైన అభిమానులు ఉన్నారు. అతడిని తలా అని పిలుస్తుంటారు. అదే అటువంటి ధోనికి తమిళం ఇష్టం లేదట. తన మాతృభాష హిందీ అంటే కూడా అంతగా ఆసక్తి లేదట. అయితే అతడికి హర్యాన్వి(Haryanvi language) అనే భాష అంటే చాలా ఇష్టమట. ఆ భాషలో కామెంట్రీ చెబుతుంటే ధోని ఆస్వాదిస్తాడట. ఆ భాష వినడానికి బాగుంటుందట.. అందువల్లే ధోనికి ఆ భాషలో కామెంట్రీ వినిపిస్తే హాయిగా ఉంటుందట.. అయితే ఆ భాషలో కామెంట్రీ వినిపిస్తున్నప్పుడు ధోనికి తన చిన్ననాటి రేడియో రోజులు గుర్తుకు వస్తాయట. పైగా ఆ భాష మాట్లాడే విధానంలో ఒక పద్ధతి ఉంటుందని.. ఆసక్తికరంగా అనిపిస్తుందని ధోని ఈ వ్యాఖ్యానించడం విశేషం. ” హర్యాన్వి భాష బాగుంటుంది. ఆ భాషలో మాట్లాడుతున్న వారు ఒక పద్ధతిని పాటిస్తుంటారు. మిగతా వాళ్లకు అది కొత్తగా ఉన్నప్పటికీ.. అది అలానే వింటూ ఉంటే ఆసక్తికరంగా ఉంటుందని” ధోని ఇటీవల ఓ స్పోర్ట్స్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం విశేషం.
Also Read : పంత్ భయ్యా.. 27 కోట్లు పెట్టి కొంటే ఇలా ఆడావ్ ఏంటి?