
Krithi Shetty: యంగ్ బ్యూటీ కృతి శెట్టి జోరు ఒక్కసారిగా తగ్గింది. గత ఏడాది వరుస చిత్రాలకు సైన్ చేసిన ఈ బ్యూటీ రేసులో వెనుకబడిన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారికంగా ఆమె చేతిలో ఒక్క తెలుగు చిత్రం మాత్రమే ఉంది. నాగ చైతన్యకు జంటగా కస్టడీ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. సీరియస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న కస్టడీ చిత్రంలో కృతి రోల్ కూడా భిన్నంగా ఎమోషనల్ నోట్ లో సాగుతుందని సమాచారం. లవ్, రొమాన్స్ వంటి యాంగిల్ ఉండకపోవచ్చు.

దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన కస్టడీ విడుదలకు సిద్ధం అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్ర విజయం కృతి శెట్టికి చాలా అవసరం. ఆమెకు 2022 అసలు కలిసి రాలేదు. వరుసగా మూడు ప్లాప్స్ పడ్డాయి. హ్యాట్రిక్ విజయాల బేబమ్మ అనూహ్యంగా హ్యాట్రిక్ ప్లాప్స్ ఇచ్చింది. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

దీంతో సాలిడ్ హిట్ తో కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృతి శెట్టికి ఆఫర్స్ తగ్గడానికి మరో రీజన్ కూడా ఉండి. శ్రీలీల ఆమెను బాగా దెబ్బతీస్తుంది. కృతి శెట్టికి రావాల్సిన అవకాశాలు ఆమె లాగేసుకుంటుంది. కృతి కోసం అనుకున్న పాత్రలు మేకర్స్ శ్రీలీలకు కట్టబెడుతున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్, మహేష్ బాబు, బాలకృష్ణ చిత్రాలతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందంలో కూడా బేబమ్మను డామినేట్ చేస్తున్న శ్రీలీల ఆమెను ఊహించని దెబ్బతీసింది.

ఈ క్రమంలో కృతి కూడా పంథా మార్చిన సూచనలు కనిపిస్తున్నాయి. మేకర్స్ ని ఆకర్షించేందుకు బట్టల సైజ్ తగ్గించేస్తున్నారు. కృతి శెట్టి తాజాగా షార్ట్ ఫ్రాక్ లో హాట్ ఫోటో షూట్ చేసింది. థైస్ కనిపించేలా టెంపరేచర్ పెంచేసింది. గతంలో కృతిని ఎన్నడూ ఇలా చూడని పక్షంలో జనాలు షాక్ అవుతున్నారు. కృతి హాట్ ఫోటోలు వైరల్ అవుతుండగా… ఆఫర్స్ కోసం బేబమ్మ కూడా చూపించేస్తుదని చెవులు కొరుక్కుంటున్నారు.
ఉప్పెన మూవీతో హీరోయిన్ గా మారిన కృతి శెట్టి సంచలనాలు నమోదు చేసింది. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఆ చిత్రం కృతి శెట్టిని ఓవర్ నైట్ స్టార్ చేసింది. అనంతరం విడుదలైన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సైతం హిట్ టాక్ తెచ్చుకోగా కృతి హిట్ సెంటిమెంట్ గా మారారు. దాంతో ఆఫర్స్ క్యూ కట్టాయి. అయితే రామ్, నితిన్, సుధీర్ లతో చేసిన చిత్రాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం కస్టడీతో పాటు కృతి ఓ మలయాళ చిత్రం చేస్తున్నారు.