Kolkata Girl: ఎవరైనా కష్టపడి సంపాదించాలని చూస్తుంటారు. డబ్బు సంపాదించే క్రమంలో ఎన్ని కష్టాలైనా పడతారు. రేయింబవలు ఒళ్లు హూనం చేసుకుని అయినా డబ్బు సంపాదించాలని భావిస్తుంటారు. న్యాయపరంగా సంపాదిస్తేనే దానికి విలువ ఉంటుంది. అంతే కాని ఏదో దొంగతనం చేసి సంపాదించడానికి ఇష్టపడరు. అందుకే డబ్బు సంపాదించేందుకు రకరకాల మార్గాలు అన్వేషిస్తుంటారు. ఎవరికైనా డబ్బులు ఊరికే రావు. కష్టపడితేనే వీలవుతుంది. ఇక్కడ మాత్రం హాయిగా నిద్రపోతే డబ్బులు రావడం విచిత్రంగా ఉంది.

ఎవరైనా పని చేయడానికి డబ్బు ఇస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం నిద్రపోతే డబ్బులిస్తామని చెప్పడం గమనార్హం. ఓ స్లీప్ సొల్యూషన్ కంపెనీ నిద్ర పోటీలు నిర్వహించింది. దీంతో కోల్ కతకు చెందిన త్రిపర్ణ చక్రవర్తి ఏకంగా రూ. ఐదు లక్షలు సంపాదించింది. వంద రాత్రులు వారి నిద్రను పరిశీలించింది. రోజుకు తొమ్మిది గంటలు హాయిగా నిద్రపోయిన ఆమె ఏకంగా రూ. 5 లక్షలు సంపాదించుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. నిద్ర పోవడానికి కూడా డబ్బులు ఇవ్వడంతో అందరు అవాక్కవుతున్నారు.
Also Read: NDTV Prannoy Roy: ఎన్టీటీవీ ప్రణయ్ రాయ్ ఎందుకు అప్పుల పాలయ్యారు? ఎందుకు అమ్ముకుంటున్నారు?
భారతీయుల్లో నిద్రకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి నిర్వహించిన పోటీల్లో త్రిపర్ణ చక్రవర్తి అందరికంటే ఎక్కువగా నిద్రపోయి బహుమతి కొట్టేసింది. వంద రాత్రులు రోజుకు తొమ్మిది గంటల చొప్పున నిద్ర పోయి ఈ ప్రైజ్ గెలుచుకుంది. దీంతో ఆమె మరో రికార్డు సొంతం చేసుకుంది. దేశంలోనే ప్రశాంతంగా నిద్రపోయే యువతిగా రికార్డు సాధించింది. దీంతో ఆమెకు మరో ఆఫర్ కూడా వస్తోంది. మరో కంపెనీ రోజుకు పది గంటలు నిద్రపోతే పది లక్షలు ఇస్తామని ప్రకటించడంతో ఇప్పుడు ఆ పోటీకి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఎవరైనా కష్టపడి పనిచేస్తేనే కడుపు నిండటం లేదు. కానీ కష్టపడి పడుకుంటే కూడా పైసలు వస్తాయంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజమే. దీంతో అందరు తిండిపోతు అని తిడతారు కానీ నిద్రపోతు అని ఎవరు తిట్టరు. కానీ కుంభకర్ణుడిలా నిద్ర పోతున్నావని తిడతారు. కానీ ఆ నిద్రే వారికి వరంగా మారుతోంది. బాగా నిద్ర పోతే కూడా డబ్బులు వస్తాయంటే ఎవరు మాత్రం వద్దంటారు. దేశంలో ఈ తరహా పోటీలు కూడా ఉండటం గమనార్హం. భవిష్యత్ లో వీటికి మరింత డిమాండ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారరు.
Also Read:‘Liger’Memes : ‘పూరి’‘కొండన్నా’ ఏంటన్నా ఇదీ.. లైగర్ ఫ్లాప్ పై హోరెత్తుతున్న మీమ్స్..