Kishore Kumar-Madhubala : కిషోర్ కుమార్-మధుబాల ప్రేమ కథ అత్యంత విషాదం. ఎన్నో కలలతో మొదలైన వారి ప్రయాణం దుర్భరంగా ముగిసింది. దివి నుండి భువికేగిన దేవకన్యలా మధుబాల ఉండేది. ఢిల్లీలో ముస్లిం కుటుంబంలో మధుబాల జన్మించారు. ఆమె అసలు పేరు ముంతాజ్ జెహన్ బేగం దెహల్వి. పరిశ్రమలో అడుగుపెడుతూనే సంచలనాలు చేసింది. ఆమె అందానికి ఆ తరం టాప్ స్టార్స్ లొంగిపోయారు. మధుబాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మధుబాల కొందరు హీరోలతో సన్నిహితంగా మెలిగారు. దిలీప్ కుమార్ తో మధుబాల చాలాకాలం ప్రేమాయణం నడిపారు. వీరి ప్రేమకథకు మధుబాల తండ్రి విలన్ అయ్యారు. దిలీప్ కుమార్ కి మధుబాల తండ్రితో విబేధాలు తలెత్తాయి. ఆ కారణంగా మధుబాలను దిలీప్ కుమార్ దూరం పెట్టాడు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలకు విరమించుకున్నాడు.
అప్పటికే మధుబాల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె గుండెలో సమస్య ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. 1960లో కిషోర్ కుమార్ మధుబాలకు ప్రపోజ్ చేశాడు. కిషోర్ కుమార్ తో మధుబాల చల్తీకా నామ్ గాడీ, హాఫ్ టికెట్ చిత్రాలకు కలిసి పనిచేశారు. కిషోర్ కుమార్ స్టార్ సింగర్ గా, నటుడిగా వెలిగిపోతున్న రోజులవి. కిషోర్ కుమార్ ప్రపోజల్ ని మధుబాల అంగీకారం తెలిపారు. అదే ఏడాది మధుబాలను కిషోర్ కుమార్ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి మధుబాల తండ్రి ఒప్పుకోలేదు. అయినా మధుబాల-కిషోర్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
పెళ్లయ్యాక ఇద్దరూ లండన్ వెళ్లారు. అక్కడే మధుబాల అనారోగ్యానికి గురయ్యారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్ ఆమె గుండెలో హోల్ ఉంది. ఆ సమస్య మరింత ఎక్కువైంది. రెండు ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతుకదని చెప్పారు. కిషోర్ కుమార్ వెంటనే ఇండియాకు తీసుకొచ్చారు. మధుబాల ఇంట్లో మంచానికే పరిమితమయ్యారు. ఆమెను చూసుకోవడానికి డ్రైవర్, పనిమనిషిని పెట్టాడు. షూటింగ్స్ తో కిషోర్ కుమార్ చాలా బిజీగా ఉండేవారు. అప్పటికి మధుబాల వయసు కేవలం 27 సంవత్సరాలు. ఒంటరితనాన్ని భరించలేక తండ్రి వద్దకు వెళ్లిపోయారు.
కిషోర్ కుమార్ నెలలో ఒకటి రెండు సార్లు కూడా మధుబాల వద్దకు వెళ్ళేవాడు కాదు. కనీసం ఫోన్ మాట్లాడేవాడు కాదు. తనని చూస్తే మధుబాల ఎమోషనల్ అవుతుంది. ఏడుస్తుంది, అది ఆమె గుండెకు మంచిది కాదు. అందుకే ఫోన్ కూడా చాలా అరుదుగా చేసేవాడు. ప్రేమ మహిమో, మధుబాల మనోధైర్యమో కానీ డాక్టర్స్ చెప్పిన దానికంటే ఏడేళ్లు ఎక్కువ కాలం మధుబాల బ్రతికారు. 1969లో ఆమె కన్నుమూశారు.
బ్రతికి ఉన్న ఉన్నంత కాలం ఆమె మనసులో ట్రై యాంగిల్ ప్రేమ కథ నడించింది అంటారు. దిలీప్ కుమార్ ని ఆమె పిచ్చిగా ఆరాధించారట. అతడు దూరం పెట్టినందుకే కిషోర్ కుమార్ ని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. అనారోగ్యం వలన కిషోర్ కుమార్ తో ఆమె సంతోషంగా గడిపిందే లేదు. ముగ్గురు స్టార్స్ మధ్య ఓ గొప్ప ప్రేమ కథ నడిచింది.