Kiraak RP- Punch Prasad: జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు కిడ్నీ సమస్య ఉంది. వైద్యం చేయించినా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఆ మధ్య అసలు నడవలేని పరిస్థితికి వెళ్ళాడు. వీల్ చైర్ లో కదలలేని స్థితిలో ఉన్న పంచ్ ప్రసాద్ గురించి తోటి కమెడియన్ నూకరాజు తెలియజేశాడు. వీడియో చేసి పంచ్ ప్రసాద్ ని ఆదుకోవాలని కోరారు. స్నేహితులు కష్ట సమయాల్లో ఆయనకు అండగా ఉంటున్నారు. కామెడీ షోలలో ఆఫర్స్ ఇస్తూ ఎంతో కొంత డబ్బులు వచ్చేలా చేస్తున్నారు. షోస్ చేయడానికి పూర్తి స్థాయిలో అతడి ఆరోగ్యం సహకరించకపోయినా… ఫ్రెండ్స్ సప్పోర్ట్ తో నెట్టుకొస్తున్నాడు.

కాగా పంచ్ ప్రసాద్ కండీషన్ గురించి కిరాక్ ఆర్పీ మాట్లాడాడు. ప్రసాద్ ని నేను ఆదుకుంటానని హామీ ఇచ్చాడు. కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ… పంచ్ ప్రసాద్ నా మిత్రుడు, చాలా మంచివాడు. అతని వద్ద ప్రస్తుతం ఒక్క రూపాయి లేదు. ఉన్నదంతా వైద్యానికి ఖర్చు చేశాడు. ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఉన్నదంతా పోగా అప్పులు చేస్తున్నాడు. పంచ్ ప్రసాద్ ని నేను ఆదుకుంటాను. అతనికి సహాయం చేస్తాను.
రూ. 15 లక్షలు ఖర్చైనా సొంత డబ్బులతో కిడ్నీ ఆపరేషన్ చేయిస్తాను. త్వరలో మణికొండలో పెద్దారెడ్డి చేపల పులుసు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాను. ఆ బ్రాంచ్ నుండి వచ్చిన లాభాల్లో పంచ్ ప్రసాద్ ప్రతినెలా డబ్బులు పంపుతాను. తన వైద్యానికి అయ్యే ఖర్చుల కంటే ఒక పదివేలు ఎక్కువే పంపుతాను… అని హామీ ఇచ్చాడు. మిత్రుడు కోసం అంతలా ఆలోచిస్తున్న కిరాక్ ఆర్పీ ఔదార్యాన్ని జనాలు కొనియాడుతున్నారు. కిరాక్ ఆర్పీ నువ్వు గ్రేట్ అంటున్నారు.

జబర్దస్త్ లో ఏళ్ల తరబడి పని చేసిన కిరాక్ ఆర్పీ ఇటీవల కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో పెద్ద కర్రీ పాయింట్ పెట్టాడు. ఈ వ్యాపారం పెద్ద ఎత్తున సక్సెస్ అయినట్లు సమాచారం. నెలరోజుల్లోపే పెట్టుబడి రికవరీ కావడంతో పాటు లాభాలు మొదలయ్యాయట. ఈ క్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా మరిన్ని బ్రాంచెస్ ప్రారంభించే ఆలోచనలో కిరాక్ ఆర్పీ ఉన్నట్లు సమాచారం. వ్యాపారం పెరగడంతో నెల్లూరు వచ్చి అదనంగా సిబ్బందిని నియమించుకొని హైదరాబాద్ తీసుకెళ్లాడు.