Kingston Movie Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ‘జీవి ప్రకాష్ కుమార్’ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తూనే హీరోగా కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ‘కింగ్ స్టన్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: స్టార్ హీరో కొడుకుతో ప్రేమాయణం..ఫొటోలతో సహా అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్ శ్రీలీల!
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సముద్ర తీరాన బ్రతుకుతున్న కొంతమంది వ్యక్తులు సముద్రంలోకి వెళ్తే చాలు శవాలుగా తిరిగి వస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? సముద్రంలో ఏముంది ఎందుకని మనుషులను చంపేస్తుంది అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికి దాన్ని ఎంగేజింగ్ గా తీసుకెళ్లడంలో మాత్రం దర్శకుడు చాలా వరకు విఫలమయ్యాడు. మొదటి నుంచి సినిమాని తీసుకెళ్లే స్టైల్ బాగున్నప్పటికి సినిమా స్క్రీన్ ప్లే లో ఉన్న రూల్స్ మొత్తాన్ని మర్చిపోయి ఆయన మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన 15 నుంచి 20 నిమిషాల లోపు ఒక మలుపు అనేది తీసుకోవాలి. లేకపోతే మాత్రం సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఆ సినిమా ఏ మాత్రం నచ్చదు అలాగే ఎంగేజింగ్ గా ఉండదు.
సినిమా స్టార్ట్ అయిన ఆఫన్నవర్ లోపు రావాల్సిన ఒక ట్విస్ట్ ను సాగదీసి ఇంటర్వెల్లో ఇవ్వడం అప్పటిదాకా ప్రేక్షకుడు నిరాశ చెందుతూ సినిమాని చూస్తూ ఉండటం వల్ల సినిమా స్క్రీన్ ప్లే చాలావరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయలేకపోయింది. చిన్న పాయింట్ ని లాగడం వల్ల సీన్లలో క్యూరియాసిటీ లేకపోవడం సినిమా చూసే ప్రేక్షకుడు అప్పటికే సినిమా నుంచి డిస్ కనెక్ట్ అయిపోవడం అన్ని చకచక జరిగిపోతూ ఉంటాయి…
ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ ఇచ్చి ఒకే అనిపించినప్పటికి ఆ తర్వాత సెకండాఫ్ అయిన ఎంగేజింగ్ గా తీసుకెళ్తారా అంటే అది కనిపించదు. సెకండాఫ్ స్టార్ట్ అవ్వడమే స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇంకా అంతే స్లోగా సినిమాని ముందుకు నడిపించారు. కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉండటం, కావాలనే సినిమా లిబర్టీని ఎక్కువగా తీసుకొని మనం నమ్మశక్యంగా లేని సన్నివేశాలను సైతం ప్రేక్షకుడికి చూపించి ఏదో ఒక విధంగా సక్సెస్ ని సాధించాలి అనుకున్నారు.
కానీ ప్రేక్షకుడికి ఆ సీన్స్ ఏ మాత్రం ఎంగేజింగ్ గా లేకపోవడం ఒకటైతే ఆ సీన్స్ చూస్తున్నంతసేపు సినిమా ఎందుకు చూస్తున్నామా? అనే చిరాకు ప్రేక్షకుడు కలుగుతుంది. ఇక చిన్న పాయింట్ గా చూస్తే సినిమా స్టోరీ అద్భుతంగా ఉన్నప్పటికి దాన్ని రెండున్నర గంటల సినిమాగా చేసే ప్రాసెస్ లో చాలా తప్పులైతే జరిగాయి. వాటన్నింటిని ముందే సరిదిద్దుకొని ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. రైటింగ్ ఇంకా బాగా రాసి ఉంటే సినిమా మంచి టాక్ ను సంపాదించుకునేది
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక జీవి ప్రకాష్ కుమార్ నటుడిగా మారి మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి నాసిరకం కథలతో సినిమాలు చేయడం వల్ల హీరోగా తనకున్న మార్కెట్ ని తను కోల్పోవడం తప్ప మరొకటి ఉండదనే చెప్పాలి. ఎందుకు ఆయన ఇలాంటి కథలను ఎంచుకుంటున్నాడు. మంచి కథతో సినిమాలు చేస్తున్న ఆయన మధ్యలో తన ఇమేజ్ కి బ్యాడ్ నేమ్ వచ్చే ఇలాంటి కథలను ఎంచుకోవడం చాలా వరకు మానేస్తే మంచిది. ఇక ఈ సినిమాలో నటనపరంగా ఆయన తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు.
అక్కడక్కడ తన నటనతో సినిమాని లేపాలనే ప్రయత్నం చేసినప్పటికి స్క్రీన్ ప్లే లో డిఫెక్ట్ ఉండడం వల్ల ఈ సినిమా పరిస్థితి ఐసియు లో ఉన్న పేషంట్ మాదిరిగా అయిపోయింది తప్ప దాన్ని బతికించే ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ అయితే కాలేదు. ఇక ఆయనను మినహాయిస్తే మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులందరు ఓకే అనిపించారు. ముఖ్యంగా ప్రేక్షకుడు ఈ సినిమాకి కనెక్ట్ అవ్వకపోవడం వల్ల నటులు ఎంత బాగా నటించాలని ఆత్రుతతో నటించినప్పటికి అందులో ఇంపాక్ట్ అయితే ప్రేక్షకుడికి రాలేదనే చెప్పాలి…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన జీవి ప్రకాష్ కుమార్ తన మ్యూజిక్ తో ఏ మాత్రం ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయాడు. కారణం ఏదైనా కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కూడా అంత బాగా ఎలివేట్ చేసే విధంగా అయితే అందించలేదు. ఇక విజువల్స్ పరంగా చూసుకుంటే కొన్ని కొన్ని షాట్స్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఏదైనా బాగుంది అంటే అది విజువల్స్ అనే చెప్పాలి. సినిమాటోగ్రాఫర్ చాలా హార్డ్ వర్క్ చేసి మరి ఈ సినిమాకి మంచి విజువల్స్ అందించాడు…
ప్లస్ పాయింట్స్
విజువల్స్
జీవి ప్రకాష్ యాక్టింగ్
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
మ్యూజిక్
ఇల్లాజికల్ సీన్స్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చె రేటింగ్ 1.5/5