Kidnapped Drama: రోడ్డుమీదు వెళ్తుంటే లిఫ్ట్ అడగేవారు కనిపిస్తుంటారు.. ఎక్కువగా బైక్‌పై వెళ్లేవారినే లిఫ్ట్ అడుగుతుంటారు. నచ్చిన వారు ఇస్తారు.. నచ్చనివారు వెళ్లిపోతారు. ఇక నగరాల్లో అయితే కారులో వచ్చేవారిని కూడా కొంతమంది లిఫ్ట్ అడగడం కనిపిస్తుంది. ముఖ్యంగా యువతులు లిఫ్ట్ కోసం రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని నగరాల్లో లిఫ్ట్ పేరుతో దోపిడీ, బ్లాక్‌మెయిల్, కిడ్నాప్‌లు కూడా జరుగుతున్నాయి. అమ్మాయిలు, మహిళలు నగర శివారుల్లో అడ్డా వేసి, కార్లలో వచ్చేవారిని లిఫ్ట్ అడగడం, లిఫ్ట్ ఇస్తే కొంత దూరం వెళ్లాక వారిని బెదిరించి డబ్బులు లాక్కోవడం, మరికొంతమంది తమపై అఘాయిత్యం చేయబోయాడని అల్లరి చేయడం వంటి ఘటనలు జరిగాయి, జరుగుతున్నాయి. ఇక్కడో కార్డులో వచ్చిన ఓ యువకుడా పిల్లలతో కిడ్నాప్ డ్రామా ఆడారు. దీంతో పిల్లలు బెదిరిపోయి వామ్మో… వాయ్యో అంటూ ఏడవడం అందరికీ నవ్వు తెప్పిస్తోంది.
కారును లిఫ్ట్ అడిగితే..
కొంతమంది చిన్న పిల్లలు.. అంతా పదేళ్లలపు వారే.. రోడ్డు పక్కన నిలబడి కారులో వచ్చే వారిని లిఫ్ట్ అడుగుతున్నారు. ఇంతలో అటువైపు వచ్చిన ఓ యువకుడు కారు ఆపి ఏం కావాలని అడిగాడు. దీంతో అందులో పెద్ద పెద్దవాడు లిఫ్ట్ కావాలని అడిగాడు. దానికి యువకుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించాడు. బస్టాండ్ కాడ దించాలని వారు కోరారు. అందుకు యువకుడు సరే రమ్మని కారు డోరు తీశాడు. పెద్దవాడు భయం లేకుండా కారు ఎక్కినప్పటికీ చిన్న పిల్లలు భయం భయంగానే కారు ఎక్కారు. ఎక్కాలా వద్దా అని ఆలోచించారు.
అసలు డ్రామా మొదలు..
పిల్లలంతా కారు ఎక్కిన తర్వాత డోర్ వేసిన యువకుడు మళ్లీ ఎక్కడి వరకు వెళ్లాలని అడిగాడు. బస్తాండ్ వద్ద దించాలని వారు కోరారు. మీ అందరినీ తీసుకుపోతా పదండ్రా అని ఆ యువకుడు అనడంతోనే పిల్లల్లో ఆందోళన మొదలైంది. కారు వేగంగా నడుపడంతో తమను ఎత్తుకుపోతున్నాడని భావించిన పిల్లలు రోదించడం మొదలు పెట్టారు. చిన్న పిల్లలు అయితే కంటికి ధారలు పడేలా ఏడ్చాడు. దీంతో సదరు యువకుడు ఆపండ్రా అన్నా వాళ్లు ఆపలేదు. ఇంతలో బస్టాండ్ రానే వచ్చింది.
జోక్ అనడంతో..
కారు ఆపిన యువకుడు బస్టాండ్ వచ్చింది.. దిగండి అన్నాడు. నేను జోక్‌చేశాను.. మీరేమో ఇంతలా ఏడుస్తున్నారని అన్నాడు. అందులో పెద్దవాడికి జోన్ అని పిల్లలతో చెప్పమని సూచించాడు. ఇప్పుడు ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.
నెటిజన్ల కామెంట్స్..
వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరు ఇక జన్మలో లిఫ్ట్ అడగరు అంటే.. కొందు లాస్ట్‌లో ఓ పిల్లవాడు నా చెప్పు అంటూ కారులో నుంచి చెప్పు తీసుకోవడం భలేగా ఉందని పేర్కొన్నారు. ఇంకొందరు ఇంకోసారి కారు ఎక్కాలంటేనే భయపడుతరు అని కామెంట్ చేవారు. ఇంకోందరు దీనికి రాజకీయ రంగు పులిమి.. కారు డ్రైవర్ జగన్ అని, పిల్లలు ఏపీ ప్రజలని పోస్టు పెట్టారు. ఇంకొందరు అయితే నిజంగా దొంగలు, కిడ్నాపర్లు ఉంటారు జాగ్రత్త అని కామెంట్ చేశారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Kidnapping drama in the car it is going viral on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com