
Prabhas Project K: ప్రాజెక్ట్ కే కథపై లెక్కకు మించిన ఊహాగానాలు ఉన్నాయి. ఇది టైం ట్రావెలర్ మూవీ అనే ఒక వాదన ఉంది. సైన్స్ ఫిక్షన్ చిత్రం అని తెలుస్తున్నప్పటికీ నేపథ్యం మీద అవగాహన లేదు. ఈ మూవీ కోసం ఆధునిక సాంకేతికత వాడుతున్నారు. స్క్రాచ్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ప్రతి చిన్న వస్తువు సృష్టిస్తున్నారు. ఆ మధ్య ఒక టైర్ రూపొందించడానికి టీమ్ ఎంత కసరత్తు చేశారో చూపించారు. అసలు కేవలం టైర్ కోసం ఇంత సమయం, బడ్జెట్ అవసరమా? టైర్ యొక్క ప్రాధాన్యత ఏమిటీ? అనే సందేహాలు కలిగాయి.
లేటెస్ట్ ఇంటర్వ్యూలో నిర్మాత అశ్వినీ దత్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సడన్ గా లార్డ్ విష్ణు ప్రస్తావన తెచ్చారు. కథ లీక్ చేయకూడదనే ఉద్దేశంతో ఆయన సుచాయిగా హింట్ ఇచ్చారు. ప్రాజెక్ట్ కే మూవీలో లార్డ్ విష్ణు ప్రస్తావన ఉంది. ఇది ఫాంటసీ మూవీ. అయితే కథలో ఎమోషన్ ప్రధానం. దాని ఆధారంగానే మూవీ నడుస్తుంది, అన్నారు. ఆయన మాటలు క్రోడీకరిస్తే ప్రాజెక్ట్ కే మోడరన్ లార్డ్ విష్ణు అవతారంతో కూడిన చిత్రం అంటున్నారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే పాయింట్ ని సమకాలీన పరిస్థితుల ఆధారంగా… ఆధునిక పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారనిపిస్తుంది.
మొత్తంగా ప్రాజెక్ట్ కే లో ఊహించని ట్విస్ట్ అయితే ఉంది. అది సినిమా విడుదలయ్యే వరకు తెలియదు. ఎందుకంటే ఇటీవల హీరోయిన్ దీపికా పదుకొనె ప్రీ లుక్ విడుదల చేశారు. ఆమె గెటప్ చూస్తే పీరియాడిక్ వారియర్ ని తలపించింది. ఒక మోడరన్ సైన్స్ ఫిక్షన్ కి ఆమె పీరియాడిక్ గెటప్ కి సంబంధం ఏమిటో అర్థం కాలేదు. ఈ చిత్ర విజయం మీద దర్శకుడు నాగ అశ్విన్ గట్టి విశ్వాసంతో ఉన్నారు. ఇది పాన్ వరల్డ్ మూవీ, గొప్ప అనుభూతి పంచుతుందని నేరుగా ప్రకటించారు.

రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుంది. దీపికా పదుకొనెతో పాటు దిశా పటాని మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్ నుండి ఈ ఏడాది రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. జూన్ 16న ఆదిపురుష్, సెప్టెంబర్ 28న సలార్ థియేటర్స్ లోకి రానున్నాయి. ఈ రెండు చిత్రాలపై కూడా అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.