
Ketika Sharma: చిత్ర పరిశ్రమలో సక్సెస్ ని లక్ డిసైడ్ చేస్తుందంటారు. టాలెంట్, స్క్రిప్ట్ సెక్షన్ తొక్కా తోటకూర అంతా ట్రాష్ అని కొట్టిపారేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దశాబ్దాల పాటు పరిశ్రమలో ఉన్నోళ్లు కూడా స్క్రిప్ట్ జడ్జి చేయలేరు. అలా చేయగలితే చిరంజీవి, కమల్, రజనీకాంత్ లాంటి హీరోలకు ప్లాప్స్ పడకూడదు కదా. ఈ కథ హిట్ అవుతుంది? ఈ కథ ఫ్లాప్ అవుతుందని స్క్రిప్ట్ దశలో చెప్పలేం. పేపర్ మీద సాదాసీదా గా ఉన్న కథ సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతం చేయవచ్చు. అద్భుతం అనుకున్న కథ సినిమా తీశాక అట్టర్ ఫ్లాప్ కావచ్చు.
Also Read: Anasuya Bharadwaj: అనసూయ చేసిన తప్పేంటి!
పరిశ్రమలో ఎదిగిన చాలా మంది స్టార్స్ హీరోయిన్ వెనకుంది ఈ లక్ ఫ్యాక్టరే. అది దక్కని యంగ్ బ్యూటీ కేతిక శర్మ సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. హ్యాట్రిక్ ఫ్లాప్స్ తో ఐరన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. కేతికను హీరోయిన్ గా తీసుకోవడానికి మేకర్స్ భయపడుతున్నారు. ఢిల్లీకి చెందిన కేతికను దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ చేశాడు. కొడుకు ఆకాష్ హీరోగా రొమాంటిక్ టైటిల్ తో మూవీ ప్రొడ్యూస్ చేశాడు.
రొమాంటిక్ చిత్ర ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆకాష్ పూరి ఫస్ట్ హిట్ కొట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు. ఇక కేతిక రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. అనంతరం నాగ శౌర్య ఆఫర్ ఇచ్చాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన లక్ష్య డిజాస్టర్ అయ్యింది. నాగ శౌర్య నెవర్ బిఫోర్ లుక్ చూసి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని భావించారు. లక్ష్య మరో ఫ్లాప్ గా కేతిక ఖాతాలో చేరింది .

ముచ్చటగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో మూడో ఫ్లాప్ ఇచ్చింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రంగ రంగ వైభవంగా ఏమాత్రం ఆకట్టుకోలేదు . దీంతో కేతిక కెరీర్ ప్రమాదంలో పడింది. నటన, గ్లామర్ తో పనిలేకుండా సెంటిమెంట్ తో పరిశ్రమ నడుస్తుంది. హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ కి డిమాండ్ ఉంటుంది. అడిగినంత ఇచ్చి తీసుకుంటారు. ఒక్క సక్సెస్ కూడా చూడని కేతికను మేకర్స్ పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. అయితే సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ చూపించి ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. కేతిక లేటెస్ట్ బోల్డ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read:Ram Charan Crush: ఆ హీరోయిన్ కి మొదటి చూపులోనే పడిపోయా… ఆమె నా క్రష్ అన్న చరణ్