
Anasuya Bharadwaj: విమర్శకు అర్థం మారిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని అది వ్యక్తిగత దూషణకు దారితీస్తుంది. ప్రతి సెలెబ్రిటీ ఈ నెగిటివిటీ ఎదుర్కొంటున్నారు. ఎక్కువో తక్కువో ప్రతి ప్రముఖుడు దీని బారినపడుతున్నారు. సాధారణంగా ప్రతి మనిషిలో పాజిటివ్ ఎనర్జీ కంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రపంచంలో ప్రశాంతత కరువైంది. అందరికీ ఓర్చుకోలేనితనం, ఎదుటి వారు బాగుపడితే నొచ్చుకునే గుణం ఉంటాయి. పక్కింటోడు కొత్త కారు కంటే ఖచ్చితంగా మనం బాధపడతాం. అయ్యో మన బ్రతుకు ఇంకా బైక్ వద్దే ఉందనేది ఒక బాధ అయితే, ఇకపై వీడి బిల్డప్ చూడలేంరా అని మరొక బాధ.
Also Read: Woman Soul Comes Out Body: మహిళ శరీరం నుంచి ఆత్మ నిజం గానే పోయిందా.. వైరల్ వీడియో
మనకు మనమే లేనిపోనివి ఊహించుకొని నెగిటివ్ థాట్స్ డెవలప్ చేసుకుంటాము. ఒక స్థాయిలో ఉన్నవాళ్లను చూస్తే ఆటోమాటిక్ గా మనలో తెలియని ఈర్ష్య, అసూయ పుట్టుకొస్తాయి. తెలిసినోడి ఎదుట ఈ నెగిటివిటీ మనం చూపించలేము. అయితే ఒక సెలెబ్రిటీ మీద విచ్చలవిడిగా సోషల్ మీడియా ద్వారా చూయించొచ్చు. మన నోటి దూల తీర్చేసుకోవచ్చు. ఎందుకంటే సదరు సెలెబ్రిటీకి కనిపించం, అలాగే మనం ఎవరో కూడా తెలియదు. కాబట్టి బూతుల నుండి ఇష్టం వచ్చిన మాట అనేస్తాం.
యాభై ఏళ్ళు పైబడి బాగా చదువుకున్న వ్యక్తి కూడా సోషల్ మీడియాలో బూతులు మాట్లాడతాడు. సమాజంలో మాత్రం చాలా హుందాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సోషల్ మీడియా బిహేవియర్ కి సోషల్ బిహేవియర్ కి చాలా తేడా ఉంటుంది. హీరో, హీరోయిన్, పొలిటీషియన్ వీరందరూ ఒక స్థాయికి ఎదిగినవారు. వాళ్లకు ఆభిమానులూ ఉంటారు. విమర్శకులూ ఉంటారు. సద్విమర్శ ఆమోదయోగ్యమే. మీ సినిమా నచ్చలేదు, పాత్ర నచ్చలేదు, సరిగా నటించలేదు, పాలన నచ్చలేదు, పాలసీ నచ్చలేదు… ఇవి సద్విమర్శల క్రిందకు వస్తాయి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పరిధిలో ఇలాంటి కామెంట్స్ చేయడంలో తప్పులేదు.

లవర్, భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, సంపాదన, ఆస్తులు వంటి వ్యక్తిగత విషయాల జోలికి పోవడం నేరం కూడాను. ఎంత పెద్ద బూతు వాడినా స్పందించే సెలెబ్రిటీలు చాలా తక్కువగా ఉంటారు. సోషల్ మీడియాలో ఎవరిని ఎమన్నా ఏం కాదనే ధోరణి ఎక్కువైంది. అనసూయ అలా కాదు. వెంటనే రియాక్ట్ అవుతుంది. సమయం కేటాయించి ఆధారాలు సేకరించి కేసులు పెడుతుంది. అలా కొందరు ఆకతాయిలకు బుద్ధి చెప్పింది. వాలెంటైన్స్ రోజు భర్తపై ప్రేమ చాటుతూ అనసూయ పోస్ట్ పెడితే ఓ నెటిజన్ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డాడు. అనసూయ రియాక్ట్ అయ్యారు. భర్తతో ఫొటో దిగడం, అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తప్పుకాదు కదా… అనసూయ చేసిన తప్పేంటి? విమర్శించాల్సిన అవసరం ఏమిటీ?. ఇది కేవలం నోటి దూల, బుద్ధి వైకల్యం!