Kerala Auto Driver: చెరువులో నీరు చేరితే కప్పలు చేరతాయని తెలుసు. డబ్బు ఉంటే కూడా బెల్లం చుట్టు చీమలు చేరినట్లు బంధువులు రాబందుల్లా చేరుతారు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. మనశ్శాంతి కరువవుతుంది. దీంతో ఆకలి వేయదు. నిద్ర పట్టదు. డబ్బుంటే సుఖమని అనుకుంటారు కానీ అది మన దరిచేరితే చుట్టు చుట్టాలు చేరి మనల్ని వేదనకు గురిచేస్తుంటారు. ఇది అక్షరాలా నిజమే. చాలాసార్లు ఈ విషయం రుజువు చేసింది. తాజాగా కేరళలో ఓ ఆటో డ్రైవర్ రూ. 25 కోట్లు లాటరీ పొందడంతో అతడికి నిరంతరం బాధలే అనుభవిస్తున్నాడు. తనకు ఈ డబ్బు ఎందుకు వచ్చిందిరా దేవుడా అంటూ కుమిలిపోతున్నాడు. తనకు డబ్బు వద్దని చెప్పడం గమనార్హం.

అతడికి దక్కిన రూ.25 కోట్లలో పన్నులు పోను రూ. 15 కోట్లు దక్కనున్నాయి. చుట్టు బంధువులు చేరి వేధిస్తుండటంతో ఏం చేయలేకపోతున్నాడు. ఇక ఏం చేయాలో కూడా అతడికి అర్థం కావడం లేదు. లాటరీ రాకపోయినా బాగుండేదని చెబుతున్నాడు. తనకు దక్కిన అదృష్టానికి నవ్వాలో ఏడవాలో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డబ్బులు వస్తే శత్రువులు తయారవుతారని తెలిసిందే. ఇది ప్రత్యక్షంగా చూసిన లాటరీ విజేత అనూప్ మానసిక ఆవేదనకు గురవుతున్నాడు.
డబ్బుంటే సుఖముండదు. బాధలే వేధిస్తాయి. డబ్బులేని పేదవారే సుఖంగా తింటారు, నిద్రిస్తారు. కానీ డబ్బుంటే దాన్ని రక్షించుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సిందే. బ్యాంకులో ఉన్నా కూడా నిరంతరం మనసులో బాధలే ఉంటాయి. తన డబ్బు ఎక్కడ దూరమవుతుందో అనే బెంగ వేధిస్తుంది. పేదవారు మూడు పూటలు పుష్టిగా తిని హాయిగా నిద్ర పోతారు. కానీ డబ్బుంటే ఆ సుఖం మనకు దక్కడం కల్లే. ఎందుకంటే డబ్బుకున్న మహా కర్మమని తెలిసిందే. ధనముంటే నిత్యం బాధలే మన వెంట నిలుస్తాయి.

ఇప్పుడు అతడికి ఏకంగా రూ. 25 కోట్లు రావడంతో ఒక్కసారిగా ధనవంతుడిగా మారిపోయాడు. దీంతో తనకు వచ్చే డబ్బులతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. తనకు వచ్చే డబ్బును రెండేళ్లు బ్యాంకులో వేస్తానని చెబుతున్నాడు. ఇక తన అవసరాలు తీర్చుకునేందుకు తక్కువ మొత్తం తన దగ్గర ఉంచుకుంటానని పేర్కొంటున్నాడు. డబ్బులు వచ్చాయని తెలియగానే చాలా మంది శత్రువులుగా మారే సూచనలు ఉన్నాయని వాపోతున్నాడు. దీంతో డబ్బులు దాచుకోవడానికి కూడా తిప్పలే ఎదురు కానున్నాయని వాపోతున్నాడు.