https://oktelugu.com/

Keerthi Suresh : అది నాలో కూడా ఉంది… ఎన్నడూ చూడని హాట్నెస్ ని పరిచయం చేసిన కీర్తి

Keerthi Suresh : కీర్తి సురేష్ తనలోని కొత్త యాంకర్ పరిచయం చేస్తున్నారు. హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ మహానటి.. నాలో కూడా హాట్నెస్ బోలెడంత దాగి ఉందని గుర్తు చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా సొగసులతో సెగలు రేపుతోంది. కీర్తి గ్లామర్ యాంగిల్ కిక్ ఇస్తుండగా ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. తాజాగా కీర్తి స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ శారీ ధరించి హొయలు పోయింది. కీర్తి అందాలు మెస్మరైజ్ చేస్తుంటే… కవ్వించే చూపు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2022 / 08:22 PM IST
    Follow us on

    Keerthi Suresh : కీర్తి సురేష్ తనలోని కొత్త యాంకర్ పరిచయం చేస్తున్నారు. హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ మహానటి.. నాలో కూడా హాట్నెస్ బోలెడంత దాగి ఉందని గుర్తు చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా సొగసులతో సెగలు రేపుతోంది. కీర్తి గ్లామర్ యాంగిల్ కిక్ ఇస్తుండగా ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. తాజాగా కీర్తి స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ శారీ ధరించి హొయలు పోయింది. కీర్తి అందాలు మెస్మరైజ్ చేస్తుంటే… కవ్వించే చూపు మరింత డామేజ్ చేస్తుంది. కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.

    ఇక కీర్తి కెరీర్ పరిశీలిస్తే ఈ ఏడాది రెండు హిట్స్ ఖాతాలో పడ్డాయి. మహేష్ కి జంటగా నటించిన సర్కారు వారి పాట హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో కీర్తి ఒక డిఫరెంట్ రోల్ ట్రై చేశారు. కీర్తి రోల్ నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. మహేష్ నే మాయ చేసే ఖిలాడీ లేడీ పాత్రలో కేక పుట్టించారు. అలాగే ఒక ఓటీటీ హిట్ దక్కించుకుంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సాన్ని కాయిదం హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో ఈ చిత్రం చిన్ని టైటిల్ తో స్ట్రీమ్ అయ్యింది.

    ప్రస్తుతం నాలుగు చిత్రాలు చేస్తున్నారు. నానికి జంటగా దసరా మూవీలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దసరా తెరకెక్కుతుంది. వెన్నెల అనే డీగ్లామర్ రోల్ చేస్తున్నారు కీర్తి. ఇక చిరంజీవి-మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో కీర్తి కీలక రోల్ చేస్తున్నారు. ఆమె చిరంజీవి చెల్లిగా కనిపించనున్నారు. ఒక ప్రక్క స్టార్స్ తో జతకడుతున్న కీర్తి చెల్లి పాత్రలు చేయడం నిజంగా సాహసం.

    చెల్లి పాత్రలు చేస్తే హీరోయిన్ పొజీషన్ గల్లంతు అవుతుందని హీరోయిన్స్ ఆ రోల్స్ చేయరు. కీర్తి మాత్రం ఆ లెక్కలేమీ ఫాలో కావడం లేదు. ఆల్రెడీ పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లిగా చేశారు. ఇక తమిళంలో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు. కీర్తి కెరీర్ కొంచెం నెమ్మదించినా వరుస చిత్రాలు ప్రకటిస్తూ ముందుకు పోతున్నారు. అదే సమయంలో కీర్తి పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నాయి. పేరెంట్స్ ఆమె కోసం సంబంధాలు చూస్తున్నారని, త్వరలో వివాహం అంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఎలాంటి అధికారిక సమాచారం లేదు.