
Keerthy Suresh- Hero Nani: హీరో నానితో కీర్తి సురేష్ గొడవకు దిగారు. గేమ్ ఆడుతూ పాయింట్స్ విషయంలో నాని మీద అసహనం వ్యక్తం చేసింది. సెట్స్ లో అందరి ముందే ఈ వివాదం చోటు చేసుకుంది. అయితే ఇది సీరియస్ తగాదా కాదు లెండి. నాని బర్త్ డే నేపథ్యంలో కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి షేర్ చేశారు. ఆ వీడియోలో నాని-కీర్తి షటిల్ ఆడుతున్నారు. ఈ గేమ్ ఆడుతున్న క్రమంలో పాయింట్స్ విషయంలో ఇద్దరికీ చిన్న గొడవైంది. ఆ వీడియో కీర్తి పోస్ట్ చేసి తన కో స్టార్ కి బర్త్ డే విషెస్ చెప్పారు.
నా మిత్రుడు, సహ నటుడు, శ్రేయోభిలాషికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడతారు. మా సంబరాలకు ఇంకా 40 రోజుల కంటే తక్కువ సమయం ఉంది. 2023 ని కుమ్మేసేయ్ ధరణి… అంటూ కీర్తి సదరు వీడియోకి కామెంట్ యాడ్ చేసింది. దసరా విడుదలకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. త్వరలో వేడుకలు మొదలు కాబోతున్నాయంటూ కీర్తి సురేష్ పరోక్షంగా చెప్పారు. నాని-కీర్తి సురేష్ కాంబోలో తెరకెక్కిన దసరా మార్చి 30న విడుదలవుతున్న విషయం తెలిసిందే.
శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న దసరా మూవ్ మీద భారీ అంచనాలున్నాయి. టీజర్ విడుదలతో అవి మరో స్థాయికి చేరాయి. నాని-కీర్తి సురేష్ డీగ్లామర్ రోల్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. నాని నుండి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా కావడం విశేషం. నాని సైతం చిత్ర విజయం మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. మరో ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ అవుతుందని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న నానిని రిపోర్టర్ అంత పెద్ద సినిమాలతో ఎలా పోల్చుకున్నారని అడిగారు.

నా ఉద్దేశం ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ మాదిరి వేల కోట్ల వసూళ్లు సాధిస్తుందని, ఆ చిత్రాలను పోలిన సన్నివేశాలు ఉంటాయని కాదు. ప్రతి ఏడాది ఇది మా ఇండస్ట్రీ సినిమా అని గర్వంగా చెప్పుకునేవి కొన్ని విడుదలవుతాయి. కెజిఎఫ్, ఆర్ ఆర్ ఆర్ అలాంటి చిత్రాలే. ఈ ఏడాదికి దసరా టాలీవుడ్ లో తెరకెక్కిన గొప్ప చిత్రంగా గుర్తింపు పొందుతుందనే అర్థంలో అన్నాను. మార్చి 30 వరకు నేను ఇదే చెబుతాను. సినిమా విడుదలయ్యాక చూసి మీరు చెప్పాలని నాని వివరణ ఇచ్చారు. దసరా మూవీలో వాడిన ఒక బూతు పదం కూడా వివాదాస్పదం అవుతోంది.