Kabzaa Trailer : కన్నడ నుంచి మరో భారీ ప్యాన్ ఇండియా మూవీ రాబోతోంది. కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్, శ్రియ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ‘కబ్జా’ సినిమాలో తెలుగు ట్రైలర్ ను చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది. ఆర్ చంద్రు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని ప్యాన్ ఇండియా లెవల్ లో భారీగా విడుదల చేస్తున్నారు.
ట్రైలర్ చూస్తే అద్భుతంగా ఉంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో ఉపేంద్ర రెండు విభిన్నమైన పాత్రలు పోషించాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 17న రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే నమ్మశక్యం కాని విజువల్స్ తో అద్భుతంగా ఉంది అనడంలో సందేహం లేదు,
కబ్జా మూవీలో కన్నడ అగ్రహీరోలు ఉపేంద్ర, శివరాజ్ కుమార్,సుదీప్ తొలిసారి నటిస్తుండడంతో హైప్ నెలకొంది. మూవీ పీరియాడికల్ లుక్, గ్రాండియర్ విజువల్స్ తో ఆసక్తి రేపుతోంది. ‘చరిత్ర ఎప్పుడు తెగిపడిన తలల కంటే ఆ తలల్ని తీసిన చేతులనే పొగుడుతుంది.అలాంటి చేయి సృష్టించిన కథే కబ్జా’ అంటూ ట్రైలర్ పై హైప్ పెంచారు.
అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక సినిమా విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తిగా యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమాను గుర్తుకు తెస్తున్నాయి. కబ్జాలో శ్రియా లుక్ కూడా కేజీఎఫ్ లో శ్రీనిధిశెట్టిని పోలి కనిపిస్తుంది. హీరోలు ఉపేంద్ర, సుదీప్ ఎలివేషన్ సీన్స్ ను కేజీఎఫ్ లో యశ్ సీన్స్ ను తలపిస్తున్నాయి. కేజీఎఫ్ కు పనిచేసిన అందరూ దీనికి పనిచేస్తుండడంతో ఆ ఫ్లేవర్ వస్తోంది.
దీంతో కబ్జా ట్రైలర్ ను కేజీఎఫ్ తో పోలుస్తూ ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కేజీఎఫ్ సెట్ లో కబ్జా సినిమాను తీసినట్టుగా అనిపిస్తోందని అంటున్నారు.
#KabzaaTrailer సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.