Junior NTR On Samantha Health: స్టార్ హీరోయిన్ సమంతకు ప్రాణాంతక ‘మైయాసిటీస్’ అనే వ్యాధి సోకిందని తేలడంతో సినీ ఇండస్ట్రీ అంతా షాక్అయ్యింది. ఈ ప్రాణాలు తీసే వ్యాధి వచ్చిందని.. దీనికి చికిత్స తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో సమంత ప్రకటించడంతో అందరూ అవాక్కయ్యారు. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ ‘మ్యూసిటీస్’ అరుదైన వ్యాధి నుంచి సమంత కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ లో సమంత త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేశాడు. జూ.ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘నువ్వు త్వరగా కోలుకోవాలి సామ్.. మీకు ఆ ధైర్యాన్ని పంపుతున్నా’ అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
సమంతతో జూ.ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి జనతాగ్యారేజ్, రామయ్యా వస్తావయ్యా, బృందావనం, రభస లాంటి పలు చిత్రాల్లో కలిసి నటించారు. సమంతకు ఇలా అరుదైన వ్యాధి సోకడంతో ఎన్టీఆర్ తట్టుకోలేక ఇలా మెసేజ్ చేశాడు.
ఇప్పటికే సమంత చర్మ వ్యాధితో బాధపడుతోందని.. అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకుంటోందని వార్తలు వచ్చాయి. కానీ దీన్ని ఎవరూ ధ్రువీకరించలేదు. తాజాగా ఈ అరుదైన వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఫొటో పెట్టగానే ఆ రూమర్లు నిజమని తేలింది.
మ్యూసిటీస్ అనేది కండరాల దీర్ఘకాలిక, కండర వాపుకు సంబంధించిన వ్యాధి. దీన్ని ఒకరకం చర్మ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి వల్ల కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం.. నడవలేకపోవడం.. నీరసంగా ఉండడం దాని లక్షణాలు. ఈ వ్యాధి సోకితే చర్మం దద్దుర్లుతో మంటపుట్టిస్తుంటుంది. ఈ అరుదైన వ్యాధిని నిర్ధారించడం కష్టం, కారణం కొన్నిసార్లు తెలియదు. లక్షణాలు కాలక్రమేణా వేగంగా.. క్రమంగా కనిపిస్తాయి. ప్రాథమిక లక్షణాలుగా కండరాల నొప్పి, పుండ్లు పడడం, అలసట, మింగడంలో ఇబ్బంది , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కలిగి ఉండవచ్చు. పురుషుల కంటే స్త్రీలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.
https://twitter.com/Samanthaprabhu2/status/1586291263313412103?s=20&t=MvqBSrxJ5BStvCv2JyACzw