Sarigamapa Show: పెళ్లంటే నూరేళ్ల పంట అని పెళ్లి కాకముందు అందరూ అనుకుంటారు. కానీ పెళ్లయ్యాక మెజార్టీ మగాళ్లు మాత్రం ‘పెళ్లంటే నూరేళ్ల మంట’ అని వాపోతుంటారు. భార్యలు పెట్టే బాధలు భరించలేక చాలా మంది బయటపడుతుంటారు. ఇప్పుడు జీ తెలుగులో ప్రసారమయ్యే ‘సరిగమప షో’లో కూడా జడ్జి అనంత్ శ్రీరామ్ తోపాటు మగ సింగర్లు అంతా బయటపడ్డారు. ‘వద్దురా.. సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా’ అని మన్మథుడు చిత్రంలోని పాటను ఓన్ చేసుకొని స్టేజీపై రచ్చ రచ్చ చేశారు.

తాజాగా ఓ కంటెస్టెంట్ ‘‘వద్దురా.. సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా’ అనే పాటను స్టేజీపై అద్భుతంగా పాడాడు. ఆ హావభావాలు, గానానికి ఫిదా అయిన జడ్జి కం రైటర్ అనంత్ శ్రీరామ్ ఏకంగా కూర్చొని ఒక్క పెల్లున వెనక్కి తన్నేసి పరుగున వచ్చి ఆ కంటెస్టెంట్ మీద పడి హగ్ చేసుకున్నాడు. నువ్వు వాస్తవం పాడావ్ అంటూ తన లోని ఎమోషన్ ను అంత బయటపెట్టేశాడు. పైకి సూట్ వేసుకున్నా కానీ.. లోపల అంతా వాతలే అంటూ భార్య కొట్టిన దెబ్బలు కవర్ చేస్తున్నానని అనంత్ శ్రీరామ్ తెగ కామెడీ చేశారు.
దీన్ని బట్టి భార్యతో మన జడ్జి అనంత్ శ్రీరామ్ ఎన్ని కష్టాలు పడుతున్నాడో.. ఆ ఫస్ట్రేషన్ అంతా స్టేజీ మీదే కనపడిందని మిగతా వాళ్లు సెటైర్లు కూడా వేశారు. ఇక అనంత్ శ్రీరామ్ జోష్ చూసి మిగతా మేల్ సింగర్స్ కూడా బరెస్ట్ అయ్యారు. తాము కూడా ఆ భార్యా బాధితులే అంటూ పెళ్లంటే నూరేళ్ల మంటనే అని పాటలు అందుకున్నారు.
ఇక అమ్మాయిలు ఊరుకుంటారా? భార్యలే గొప్పవాళ్లు అనే తరహాలో పాటలు అందుకున్నారు. ఇలా పెళ్లయిన భార్యలు/భర్తల గొప్పతనంపై సినీ ఇండస్ట్రీలో ఉన్న పాటలన్నింటిని ఇందులో వల్లే వేశారు.
ఇలా సరిగమప షో కాస్త ఈ ఒక్కపాటతో ‘భార్య బాధితుల షో’గా మారింది. మేల్ సింగర్స్ అంతా పెళ్లయ్యాక తాము పడిన కష్టాలను పాట రూపంలో చేష్టల రూపంలో బయటపెట్టేశారు. ఇది కాస్త పాటల షోను కామెడీ షోగా మార్చేసింది.
https://www.youtube.com/watch?v=5W1dIm4S4L4
Recommended Videos: