Homeఎంటర్టైన్మెంట్Baba Bhaskar: బాబా భాస్కర్ ఇచ్చే ట్విస్ట్ రివీల్ చేసిన నాగ్.. అషురెడ్డికి షాక్..

Baba Bhaskar: బాబా భాస్కర్ ఇచ్చే ట్విస్ట్ రివీల్ చేసిన నాగ్.. అషురెడ్డికి షాక్..

Baba Bhaskar: బిగ్‌బాస్ షో వారమంతా ఎలా గడిచినా వీకెండ్‌కు వచ్చేసరికి జోష్ వస్తుంది. ఎందుకంటే ఆరోజు నాగార్జున ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి. శని, ఆది వారాల్లో నాగార్జున హౌస్‌మేట్స్‌తో చెప్పే మాటలు, వాళ్లకు ఇచ్చే సలహాలు, వార్నింగులు ఆసక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా నాగ్ ఆడించే సరదా ఆటలు కూడా మంచి వినోదాన్ని అందిస్తాయి. అయితే ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో మాత్రం నాగ్ ఇచ్చిన ట్విస్ట్‌ హౌస్‌లోని అషూరెడ్డికి ముచ్చెమటలు పట్టించింది.

Baba Bhaskar
Ashu Reddy

ఇంతకీ నాగ్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే.. ఈ సీజన్‌లో బాబా భాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన వచ్చీ రావడంతోనే తనకు బిగ్‌బాస్ ఇచ్చిన పవర్‌ను ఉపయోగించి బిందుమాధవిని సేవ్ చేశాడు. ఈ పరిణామంతో అఖిల్ బ్యాచ్‌లోని సభ్యులు షాక్‌కు గురయ్యారు. అంతేకాకుండా బాబా భాస్కర్ మరో రెండు వారాల్లో బయటకు వెళ్లిపోతాడని.. మొమైత్ ఖాన్ తరహాలో ఆయన కూడా వెళ్తూ.. వెళ్తూ ఓ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసి తీసుకువెళ్తాడని హమీదా, అరియానా, అషూరెడ్డి చర్చించుకున్నారు.

తాజాగా ఇదే విషయాన్ని నాగార్జున బాబా భాస్కర్‌తో ప్రస్తావించాడు. మీరు వెళ్లేటప్పుడు ఎవరిని తీసుకువెళ్తారు అని అడ్డగా.. బాబా భాస్కర్ తాను అషూరెడ్డిని తీసుకుపోతానని సమాధానం ఇచ్చాడు. దీంతో అషూరెడ్డిని కాసేపు నాగార్జున ఆటపట్టించాడు. తాను స్టేజీపైన అషూరెడ్డి కోసం వెయిట్ చేస్తుంటానని.. ఆమె బాబా భాస్కర్‌తో బయటకు వచ్చేయాలని చెప్పాడు. గతంలో తాము ఊహించినట్లుగానే నాగార్జున కూడా మాట్లాడేసరికి అషూరెడ్డి షాక్‌కు గురైంది.

Baba Bhaskar
Baba Bhaskar

ఇది చాలా అన్‌ఫెయిర్ గేమ్ అని.. ఇలా ఎలా చేస్తారని అషూరెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేయగా.. అఖిల్ మాత్రం నాగ్ మాటలను విశ్వసించలేదు. అలా చేయరని.. నాగ్ సార్ ఊరికే చెప్తున్నారని ధైర్యం చెప్పాడు. అయితే చాలాసేపు సస్పెన్స్ నడిచిన తర్వాత నాగార్జున ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. బాబా భాస్కర్ ఎక్కడికీ వెళ్లరని.. ఆయన హౌస్‌లో ఉండేందుకే వచ్చారని చెప్పడంతో అషూరెడ్డి ఊపిరి పీల్చుకుంది. కాగా ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియలో అజయ్‌తో పాటు చివరి వరకు అషూరెడ్డి ఉండటంతో ఆమె టెన్షన్‌గానే కనిపించింది.

Recommended Videos:

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular