Jennifer Aniston: ఇండస్ట్రీలో ఫిట్నెస్ అండ్ బ్యూటీ మాట్లాడతాయి. ముఖ్యంగా హీరోయిన్స్ పర్ఫెక్ట్ ఫిగర్ మైంటైన్ చేయడం చాలా అవసరం. హాలీవుడ్ లో మొదలైన జీరో సైజ్ ట్రెండ్ బాలీవుడ్ టు టాలీవుడ్ వరకు కూడా పాకింది. కొందరు హీరోయిన్స్ అసలు ఏజ్ కనబడనీయరు. వృద్ధాప్యం దరిచేరనీయరు. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో ఎప్పుడూ యంగ్ గా కనిపిస్తారు. అమెరికన్ స్టార్ లేడీ జెన్నిఫర్ అనిస్టన్ ఈ కోవకు చెందుతుంది. 53 ఏళ్ల జెన్నిఫర్ స్వీట్ సిక్స్టీన్ లుక్ మైంటైన్ చేస్తున్నారు. ఆమె యవ్వన రహస్యం తెలుసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో జెన్నిఫర్ తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేశారు.

జెన్నిఫర్ ప్రతిరోజూ 15-15-15 వర్క్ అవుట్ టెక్నిక్ ఫాలో అవుతారట. ఈ ఎక్సర్సైజ్ థీయరీ ఆమెను ఫిట్ అండ్ యంగ్ గా ఉంచుతుందట. 15-15-15 వర్క్ అవుట్ థీయరీని ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు. జిమ్ లో 15 మినిట్స్ సైకిల్ తొక్కడం, 15 నిమిషాలు క్రాస్ ట్రైనర్ ఎక్సర్సైజ్, 15 నిమిషాలు ట్రెడ్ మిల్ పై పరుగులు తీయడం చేయాలట. రోజుకు ఈ మూడు వ్యాయామాలకు 45 నిమిషాలు కేటాయిస్తే చాలంటుంది. 15-15-15 పద్ధతి ఎంతో ప్రయోజనాలు ఇస్తుందట. అనవసరమైన కొవ్వు కరిగించి… బరువు తగ్గించి ఫిట్ గా ఉండేలా చేస్తుందట. ఫిట్ గా ఉంటే ఆటోమేటిక్ గా అందం వస్తుంది కాబట్టి… ఈ స్కీమ్ ఫాలో అవ్వండి అంటున్నారు.
ప్రమాదాల వలన శరీరానికి తగిలిన గాయాల నుండి కూడా ఈజీగా బయటపడవచ్చని చెబుతున్నారు. ఇక స్టార్ లేడీ చెప్పిన సూత్రం అందరూ పాటించడం ఖాయంగా కనిపిస్తుంది. జెన్నిఫర్ హాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరు. ఆమెకు ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ అభిమానులున్నారు. జెన్నిఫర్ పేరెంట్స్ జాన్ అనిస్టన్, నాన్సీ కూడా నటులే. ఈమె హాలీవుడ్ స్టార్ బ్రాడ్ ఫిట్ ని వివాహం చేసుకున్నారు. 2000లో వివాహం కాగా 2005లో విడాకులు తీసుకొని విడిపోయారు.

అనంతరం నటుడు దర్శకుడు జస్టిన్ పాల్ ని 2015లో పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లకే ఆయనకు గుడ్ బై చెప్పేసింది. 2017లో జస్టిన్ తో విడాకులు తీసుకొని విడిపోయింది. 1993లో విడుదలైన లీప్రీచెన్ చిత్రంతో పూర్తి స్థాయి నటిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ది ఐరన్ జైంట్, ది ఆఫీస్ స్పేస్, రాక్ స్టార్, బ్రూస్ ఆల్ మైటీ, ది బ్రేకప్,పిక్చర్ పర్ఫెక్ట్ వంటి చిత్రాలు ఆమెకు పేరు తెచ్చాయి.