
దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళిని ‘ఆర్ఆర్ఆర్’ను తెరక్కిస్తుండటంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
‘ఆర్ఆర్ఆర్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా కన్పించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’.. ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు సోషల్ మీడియాలో సన్షేషన్ క్రియేట్ చేశాయి. ఇద్దరు దేశభక్తులను రాజమౌళి సినిమాటిక్ స్టైల్లో చూపిస్తుండటం విశేషం.
స్వాత్రంత్య సమరంలో చాలా కీలకమైన ఓ ఘట్టాన్ని ‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళి చూపించేందుకు కథలో మార్పులు చేస్తున్నాడనే టాక్ విన్పిస్తోంది. భారత స్వాతంత్ర్యోద్యమాన్ని కీలక మలుపు తిప్పిన జలియన్ వాలాబాగ్ ఘట్టాన్ని ‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళి చూపించబోతున్నాడట. ఈ ఎపిసోడ్ సినిమాకు టర్నింగ్ పాయింట్ గా మారునుందనే ప్రచారం జరుగుతోంది.
భారతీయులపై బ్రిటిష్ వారి దౌర్జాన్యానికి నిదర్శనంగా చరిత్రలో జలియన్ బాగ్ ఘటన ఉంది. జనరల్ డయ్యర్ దేశాలతో నాడు భారతీయులపై బ్రిటిష్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వెయ్యిమందికిపైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాతే బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమివేయాలనే సంకల్పం నాటి యువకుల్లో బలంగా కలిగింది. ఈ సంఘటనను రాజమౌళి తనదైన స్టైల్లో వెండితెరపై చూపించనున్నట్లు తెలుస్తోంది.
దీంతో అల్లూరి.. కొమురంభీంలకు జలియన్ వాలాబాగ్ సంఘటనను ఎలా లింకు చేస్తారనేది ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’పై అభిమానుల్లో ఎన్నో అంచనాలుగా కొత్తగా జలియన్ వాలాబాగ్ ఎపిసోడ్ సినిమాలో భాగం కావడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. విడుదలకు ముందే సినిమాపై అంచనాలను పెంచి వాటిని ఆదుకోవడంలో రాజమౌళి విజయవంతం అవుతూనే ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ రాజమౌళి మరోసారి మ్యాజిక్ చేస్తాడనే టాక్ విన్పిస్తోంది.