TJ Gnanavel Dosa king : మరో జైభీమ్.. సినిమాగా ‘జీవజ్యోతి’ కేసు.. ఈ 18 ఏళ్ల పోరాటం కథేంటి?

TJ Gnanavel Dosa king: సినిమాలు అందరూ తీస్తారు. కానీ చేసే పనిని దైవంగా భావించే వారు కొందరుంటారు. మన సినిమా సమాజానికి ఉపయోగపడాలన్న సామాజిక సృహ ఉండాలని తపన పడుతారు. వారికి వృత్తే దైవం. దాని కోసం ఎంతకైనా తెగిస్తారు. ఎందాకైనా పోరాడతారు. వారిని పని రాక్షసులని కూడా అంటారు. అలాంటి వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అనుకున్న పనిని తమకు అనుకూలంగా చేసుకోవడంలోనే వారికి మజా ఉంటుంది. అది ఏ రంగానికైనా వర్తిస్తుంది. కోలీవుడ్ […]

Written By: NARESH, Updated On : July 26, 2022 9:04 pm
Follow us on

TJ Gnanavel Dosa king: సినిమాలు అందరూ తీస్తారు. కానీ చేసే పనిని దైవంగా భావించే వారు కొందరుంటారు. మన సినిమా సమాజానికి ఉపయోగపడాలన్న సామాజిక సృహ ఉండాలని తపన పడుతారు. వారికి వృత్తే దైవం. దాని కోసం ఎంతకైనా తెగిస్తారు. ఎందాకైనా పోరాడతారు. వారిని పని రాక్షసులని కూడా అంటారు. అలాంటి వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అనుకున్న పనిని తమకు అనుకూలంగా చేసుకోవడంలోనే వారికి మజా ఉంటుంది. అది ఏ రంగానికైనా వర్తిస్తుంది. కోలీవుడ్ సూపర్ డైరెక్టర్ జ్ఞానవేల్ గురించి తెలిసిందే. ఆయన ‘జై భీమ్’ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శల ప్రశంసలు అందుకున్నాడు. దేశవ్యాప్తంగా అసహాయులకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు గట్టారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. తనదైన శైలిలో స్క్రీన్ ప్లే రాసుకుని చిత్రాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు. ఈ చిత్రం అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఆయన మరో సంచలన ప్రకటన చేశాడు. తాను తీయబోయే రెండో సినిమాపై స్పష్టత ఇచ్చారు. అదే ఇప్పుడు సంచలనమైంది. అందరు ఈ కొత్త సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు.

అది మామూలు స్టోరీ కాదు. భర్తను చంపిన వ్యాపారిపై భార్య చేసే న్యాయపోరాటం. ఆమె ఏకంగా 18 సంవత్సరాల పాటు పోరాటం చేసి అతడికి శిక్ష పడేలా చేసింది. దీంతో ఆమె తెగువకు ప్రపంచమే భేష్ అంది. అందరూ ఆశ్చర్యపోయారు. భర్త కోసం ఆమె చేసిన పోరాటం గురించి ఇప్పటికే ఓ పుస్తకం కూడా రాశారు. దాని పేరు ‘మర్డర్ ఇన్ ద మెనూ’. అలా ఆమె చేసిన న్యాయ పోరాటం అందరిలో ఎంతో స్ఫూర్తిని నింపింది. దాని ఆధారంగా సినిమా నిర్మించాలని జ్ఞానవేల్ భావించాడు. అనుకున్నదే తడవుగా దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టాడు. దీంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడింది.

ఇక ఈ అసలు కథ ఏంటంటే.. చెన్నైలోని శరవణ రెస్టారెంట్ నిర్వాహకుడు పిచ్చై రాజగోపాల్. అతడికి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. కానీ డబ్బు మీద యావ మాత్రం పోలేదు. దీంతోపాటు అతడికి జాతకాల పిచ్చి కూడా ఉంది. ఒకసారి ఒక జ్యోతిష్కుడు అతడి చేయి చూసి నువ్వు జీవజ్యోతి అనే వేరొకరి భార్యని పెళ్లాడితే ఇంకా బాగా ధనం వస్తుందని ఆశ చూపాడు. దీంతో అప్పటి నుంచి రాజగోపాల్ పెళ్లి అయ్యి భర్త కూడా ఉన్న ఆమె వెంట పడటం ప్రారంభించాడు. కానీ ఆమె లొంగలేదు. డబ్బు ఇస్తానన్నా కూడా లొంగకపోవడంతో అతడి ఆశ చావలేదు. తన భర్తను వదిలి రానని జీవజ్యోతి తెగేసి చెప్పేసింది. దీంతో ఆమె భర్తను చంపితే తన వశమవుతుందని భావించి రాజగోపాల్ స్కెచ్ గీశాడు. దారుణంగా ఆమె భర్తను చంపిస్తాడు.

తన కోసం తన భర్తను చంపించిన రాజగోపాల్ పై జీవజ్యోతి న్యాయపోరాటానికి దిగుతుంది. పోరాటం చేసి అతడికి శిక్ష పడేలా చేస్తుంది. చివరకు అతడు అనారోగ్య కారణాల వల్ల బెయిల్ పై బయటకు వచ్చి 18 ఏళ్లు బయటే ఉంటాడు.. 2019లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో మళ్లీ అతడిని జైలుకు పంపుతారు. అక్కడే రాజగోపాల్ చనిపోయాడు. 18 ఏళ్లపాటు జీవజ్యోతి చేసిన న్యాయపోరాటాన్ని ‘జంగ్లీ పిక్చర్స్ బ్యానర్’ పై ‘దోశాకింగ్’ అనే పేరుతో సినిమా నిర్మాణానికి నడుం బిగించారు. జీవజ్యోతి చూపించిన తెగువ గురించే సినిమా కథనం ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆమె కథను సినిమాగా తీసేందుకు జ్ఞానవేల్ సిద్ధమైనట్లు చెబుతున్నారు. మొత్తానికి మరో రియల్ స్టోరీ తెరకెక్కించి మరోమారు బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఆరాటపడుతున్నాడు. మరి ఇది తెరపై ఎంత అద్భుతంగా వస్తుందన్నది వేచిచూడాలి.