
అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయినా ఆమె వారసత్వాన్ని.. అందాన్ని ఈ భావితరానికి అందిస్తోంది ఆమె కూతురు జాన్వీ కపూర్. పలు బాలీవుడ్ సినిమాల్లో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ శ్రీదేవిని మైమరిపించేలా అభినయాన్ని అందాలను ఆరబోస్తోంది.
ఇప్పుడు బాలీవుడ్ లో జాన్వీ కపూర్ అందంతో పాటు నటనతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. తొలి చిత్రం ‘ధడక్’ మూవీ తో జాన్వీ అభిమానుల గుండెల్లో చెదరని ముద్ర వేసుకుంది. జాన్వీ కపూర్ పాన్ ఇండియా మూవీ ‘తఖ్త్’లో నటించింది. విజయ్ దేవరకొండతో కలిసి ‘ఫైటర్’ మూవీ లో జాన్వీ నటిస్తుందనే వార్తలు హల్చల్ చేసాయి. కాని జాన్వీకి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ‘ఫైటర్’ సినిమా వదులుకుందని సమాచారం.
తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ డాన్స్ వీడియోని షేర్ చేసింది. మరోసారి తన డ్యాన్స్ తో అభిమానుల గుండెల్లో గుచ్చేసింది. ఫిల్మ్ ఫేర్ స్టేజీని మిస్ అవుతున్నా అందుకే ఇలా స్విమ్మింగ్ ఫూల్ పక్కన డ్యాన్స్ చేస్తున్నా అంటూ ఒక వీడియోను జాన్వీకపూర్ పంచుకుంది. బహుషా పక్కనే ఉన్నది ఆమె చెల్లెలులాగా కనిపిస్తోంది.
ఓ హాలీవుడ్ పాటకు అచ్చం పాప్ సింగర్ లా వయ్యారంగా డాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు శ్రీదేవి మించి కవ్వించేలా ఉందే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/CN1gzHrlTFK/?utm_source=ig_web_copy_link