Gravity: భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని అందరికీ తెలుసు. పైకి ఎగిరిన వస్తువులన్నీ కిందపడడానికి అదే కారణమని చిన్నప్పుడే పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ గురుత్వాకర్షణ శక్తిని న్యూటన్ కనిపెట్టినట్లు కూడా చదువుకున్నాం. న్యూటన్ ఓ యాపిల్ చెట్టుకింద కూర్చున్నప్పుడు యాపిల్ కిందపడడంతో ఎందుకు పడిందని ఆలోచన, ఆయన చేసిన పరిశోధన ఫలితంగా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని గుర్తించినట్లు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తిని న్యూటన్ కంటే ముందే కనుకొన్నట్లు గుర్తించారు. ఇందుకు ఆధారాలు కూడా చూపుతున్నారు. ఎవరు కనుగొన్నారు.. ఎప్పుడు కనుగొన్నారు అనే వివరాలు తెలుసుకుందాం.
ఆ పుస్తకంలో వివరంగా..
భూమికి గ్రావిటీ ఉందని న్యూటన్ కంటే ముందే భారతీయులు కనుగొన్నట్లు ఇటీవల ఇంగ్లండ్‌కు చెందిన మాంచెస్టర్స్ యూనివర్సిటీ æవాళ్లు ఒక ఆర్టికల్ రాశాలు. అందుకు ఆధారాలను కూడా తెలిపారు. ఇందుకు ఒక ఆధారంగా ‘విశేషిక సూత్ర’ అనే పుస్తకాన్ని చూపారు. ఈ పుస్తకాన్ని మహర్షి కన్నడ్ రాశారు. వెయ్యేళ్లకు ముందే 2వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దాల మధ్య మహర్షి కన్నడ్ గ్రావిటీని గురుత్వ అని తను రాసిన పుస్తకంలో పేర్కొన్నాడు. గ్రావిటీని కనుగొన్నారు. అప్పటికి న్యూటన్ పుట్టలేదు. దీని ఆధారంగా డాక్టర్ జార్జ్ జి.జోషెఫ్ తన ఆర్టికల్‌లో ఈ సమాచారాన్ని కేరళ స్కూల్స్ ఎలా భద్రపర్చారో కూడా వివరించారు.
బ్రిటిషర్స్ కుట్ర పూరితంగా..
1300 ఏళ్ల క్రితం బ్రిటిషర్స్‌కు చెందిన క్రిష్టియన్ మిషనరీలు భారతీయులు కనుగొన్న అనేక విషయాలను సేకరించాయి. మిషనరీల రాకతో గురుకులాలు పోయి ఇంగ్లిష్ ఎడ్యుకేషన్ సిస్టం వచ్చింది. అప్పటి నుంచి భారతీయుల ఆవిష్కరణలను బ్రిటిషర్ల ఆవిష్కరణలుగా చెప్పడం ప్రారంభించారు. అలా గురుత్వాకర్షణ గురించి కూడా బ్రిటిషన్ న్యూటన్ పేరును ప్రచారంలోకి తెచ్చారు. దీనికి ఓ కథ కూడా అల్లారు. కానీ వాస్తవానికి గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నది మాత్రం మన భారతీయుడే.