
Manchu Brothers: మంచు బ్రదర్స్ మధ్య గొడవలు ఉన్నాయి అనే విషయం గత కొంతకాలం గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తే, అయితే ఇది కేవలం పుకారు మాత్రమే అని ఇన్ని రోజులు అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ అన్నదమ్ముల మధ్య గొడవ రోడ్డు మీదకి వచ్చింది. మంచు విష్ణు తన తమ్ముడు మంచు మనోజ్ పై దాడి చెయ్యడానికి దూసుకెళ్తున్న వీడియోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసారు.దీనిపై మంచు మోహన్ బాబు కూడా స్పందించాడు.
‘అన్నదమ్ముల మధ్య గొడవ గొడవలు సర్వసాధారణం, అయితే అది వాళ్ళిద్దరికీ మంచిది కాదు’ అంటూ ఈ సందర్భంగా ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఫోన్ చేసి చెప్పాడు. అయితే మొత్తం కుటుంబం లాగా కలిసిమెలిసి ఉండే ఈ ఇద్దరి మధ్య గొడవలు రావడానికి కారణం ఏమిటి..?,మంచు విష్ణు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే వీళ్లిద్దరి మధ్య గొడవలు మొదలవ్వడానికి కారణం ఆస్తులే అని తెలుస్తుంది. తనకి దక్కాల్సిన ఆస్తిని మంచు విష్ణు దక్కనివ్వకుండా చేస్తున్నాడనే మనోజ్ ఆరోపణ.ఈ విషయం లో వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగి , మనోజ్ ఇంటి నుండి బయటకి వెళ్లి సెపెరేట్ గా ఉంటున్నాడు.తిరుపతి లో ఉన్న ఒక ల్యాండ్ కోసమే ఈ అన్నదమ్ములిద్దరూ కొట్టుకుంటున్నట్టు తెలుస్తుంది.
మరి ఈ గొడవని మోహన్ బాబు సర్దుతాడా లేదా అనేది చూడాలి.ఏది ఏమైనా కుటుంబం లో ఎన్ని గొడవలు జరిగినా రోడ్డు మీదకి ఎక్కడం సరికాదని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. మనోజ్ అలా వీడియో అప్లోడ్ చేసి ఉండకుండా ఉండాల్సింది అని అంటున్నారు. మోహన్ బాబు కూడా ఈ విషయం పై మనోజ్ మీద ఫైర్ అవ్వడం తో ఆయన వెంటనే వీడియో ని డిలీట్ చేసాడు.