Nayanthara Pregnant: సౌత్ ఇండియా లో దశాబ్ద కాలం నుండి ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నటి నయనతార..యూత్ లో ఈమెకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు..ఎంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీ కి పుట్టుకొస్తున్న నయనతార స్థానం ని మాత్రం ఎవ్వరు అందుకోలేకపోతున్నారు..అంతటి క్రేజ్ ఉన్న నయనతార కి సంబంధించి ఏ వార్త వచ్చిన సోషల్ మీడియా లో వైరల్ అయిపోతూ ఉంటుంది..ఈ ఏడాది జూన్ 9 వ తారీఖున ఆమె తన ప్రియుడు సతీష్ విగ్నేష్ ని పెళ్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే..మహాబలిపురం లో వీళ్లిద్దరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది..త్వరలోనే వీరి పెళ్లి వీడియో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది..అయితే వీళ్లిద్దరి గురించి సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం అవుతూ హల్చల్ చేస్తుంది.

అసలు విషయానికి వస్తే నయనతార ప్రెగ్నెంట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఇటీవల నయనతార భర్త సతీష్ విగ్నేష్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పిల్లతో కలిసి ఉన్న ఫోటో ని షేర్ చేస్తూ ‘ఈమధ్య నేను నయనతార పిల్లలతో బాగా సమయం కేటాయిస్తున్నాం..భవిష్యత్తు కోసం ఆ మాత్రం ప్రాక్టీస్ చెయ్యాలి కదా’ అంటూ ట్వీట్ వేసాడు..అంటే దీని అర్థం నయనతార ప్రెగ్నెంట్ అయ్యిందని..అది పరోక్షంగా అభిమానులకు తెలియచేయడం కోసమే విగ్నేష్ ఆ పోస్ట్ చేసాడని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి.

ఇక నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం ఆమె నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబర్ 5 వ తారీఖున విడుదలకు సిద్ధం గా ఉంది..మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఈ సినిమా తో పాటుగా ఆమె షారుఖ్ ఖాన్ మరియు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘జవాన్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది..వీటితో పాటు తమిళం లో రెండు మూడు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి..ఇలా పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలతో క్షణం తీరిక గడుపుతుండడం విశేషం.
Also Read: Minister Roja: అవమానించిన హైపర్ ఆది, రాంప్రసాద్.. జబర్ధస్త్ స్టేజీ మీదనే ఏడ్చి వెళ్లిపోయిన రోజా
[…] Also Read: Nayanthara Pregnant: తల్లి కాబోతున్న నయనతార..వైరల్… […]
[…] Also Read: Nayanthara Pregnant: Nayanthara is going to be a mother..Latest post going viral […]