Brahmanandam: టాలీవుడ్ లో ఇప్పటికీ ఎప్పటికీ బ్రహ్మానందం లాంటి కమెడియన్ లేడు..ఎన్ని జన్మలు ఎత్తిన అలాంటి హాస్య నటుడు పుట్టడు అని చెప్పడం లో ఏమాత్రం అతిశయం లేదు..రోజంతా కష్టం చేసి ఎంతగానో అలిసిపోయిన ఒక ఉద్యోగి కి ఉపశమనం బ్రహ్మనందం కామెడీ..అలాగే జీవితం లో కష్టాలను తప్ప సుఖం అంటే ఏంటో కూడా తెలియని మనుషులకు కూడా కాసేపు వాడి జీవితంలోని దరిద్రాలన్నిటిని మర్చిపొయ్యి కాసేపు బ్రహ్మానందం కామెడీ ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి కడుపుబ్బా నవ్వుకోగలరు.

అందుకే ఆయనని హాస్య బ్రహ్మ అని అందరూ అంటూ ఉంటారు..సుమారు వెయ్యి కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ప్రస్తుతానికి సినిమాలకు సెలవు ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు..కానీ కళామ్మ తల్లి ఆయన మళ్ళీ సినిమాల్లోకి రావాలని కోరుకుంటుంది..అలాంటి మహానుభావుడి పుట్టిన రోజు నేడు..ఈ సందర్భంగా బ్రహ్మానందం గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము.
బ్రహ్మానందం నేడు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధానమైన కారకులు ఒకరు మెగాస్టార్ చిరంజీవి అయితే మరొకరు జంధ్యాల..చిరంజీవి బ్రహ్మానందం లో ఉన్న అద్భుతమైన కామెడీ టైమింగ్ ని గుర్తించి..అతనిని జంధ్యాల కి పరిచయం చేయించాడు..అలా జంధ్యాల తీసిన ‘అహనా పెళ్ళంట’ సినిమాలో కమెడియన్ గా చేసిన బ్రహ్మానందం, ఆ తర్వాత కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..ఒకానొక దశలో కేవలం బ్రహ్మానందం వల్లే సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కూడా..ఆయన లేకపోతే థియేటర్స్ కి ఆడియన్స్ కదలని పరిస్థితి ఏర్పడింది.

అంత క్రేజ్ ఉండడం తో దర్శక నిర్మాతలు కూడా బ్రహ్మానందం కాల్ షీట్స్ కోసం క్యూలు కట్టేవారు..ఒక్క రోజుకు గాను ఆయనకీ 12 లక్షల రూపాయిలు పారితోషికం ఇచ్చేవారు..అలా వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం క్యాలండర్ లో ఒక్కరోజు కూడా ఖాళీ ఉండేది కాదు..అలా ఆయన కేవలం సినిమాల ద్వారానే 400 కోట్ల రూపాయిలను సంపాదించినట్టు తెలుస్తుంది..భారత దేశం లో ఏ కమెడియన్ కూడా ఇంత సంపాదించి ఉండదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.