https://oktelugu.com/

Bigg Boss 6 Telugu Inaya : డేంజర్ జోన్ లో ఇనాయ..ఇదెక్కడి ట్విస్ట్ సామీ!

Bigg Boss 6 Telugu Inaya : బిగ్ బాస్ ఈ ఆరో సీజన్ లో జరుగుతున్న అన్యాయమైన ఎలిమినేషన్స్..ఈ షోని డిజాస్టర్ దిశగా నడిపిస్తున్నాయి.. ఈ సీజన్ మొత్తం ప్రేక్షకులు ఓటు వేసిన కంటెస్టెంట్స్ ని కాకుండా..బిగ్ బాస్ కి ఇష్టమైన కంటెస్టెంట్స్ ని లోపలకి ఉంచుకొని మిగిలిన కంటెస్టెంట్స్ ని బయటకి నెట్టేస్తున్నా భావన ఈ షోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కలుగుతోంది.. ఇప్పుడు లేటెస్ట్ గా బిగ్ బాస్ ఇవ్వబోతున్న ట్విస్టు ఏమిటంటే.. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 9, 2022 / 06:01 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Inaya : బిగ్ బాస్ ఈ ఆరో సీజన్ లో జరుగుతున్న అన్యాయమైన ఎలిమినేషన్స్..ఈ షోని డిజాస్టర్ దిశగా నడిపిస్తున్నాయి.. ఈ సీజన్ మొత్తం ప్రేక్షకులు ఓటు వేసిన కంటెస్టెంట్స్ ని కాకుండా..బిగ్ బాస్ కి ఇష్టమైన కంటెస్టెంట్స్ ని లోపలకి ఉంచుకొని మిగిలిన కంటెస్టెంట్స్ ని బయటకి నెట్టేస్తున్నా భావన ఈ షోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కలుగుతోంది.. ఇప్పుడు లేటెస్ట్ గా బిగ్ బాస్ ఇవ్వబోతున్న ట్విస్టు ఏమిటంటే.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఇనాయ సుల్తానాని బయటకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారట..వాస్తవానికి వచ్చిన ఓటింగ్ ప్రకారం బాటమ్ టాప్ 2 లో ఉన్న కంటెస్టెంట్స్ శ్రీ సత్య మరియు కీర్తి.

    వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి..కానీ వీళ్లిద్దరు కాకుండా ఇనాయ డేంజర్ జోన్ లో వచ్చినట్టు వార్తలు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.. ఓటింగ్ ప్రకారం ఇనాయా గత కొద్ది వారాల నుండి మొదటి స్థానంలో కొనసాగుతోంది. రేవంత్ కి నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీనిస్తోంది.
    టైటిల్ విన్నర్ గా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నిలుస్తారని మొదటి నుండి అందరూ అనుకుంటున్నారు.. కానీ ఇలా డెంజర్ జోన్ లోకి వస్తుందని మాత్రం ఇనాయని ద్వేషించేవారు కూడా అనుకోలేదు.

    కీర్తి మరియు శ్రీ సత్య కాకుండా ఈ వారం ఇనాయ ఎలిమినేట్ అయితే మాత్రం బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే అన్యాయపు సీజన్ గా మిగిలిపోవడం ఖాయం.. మరి సోషల్ మీడియాలో వచ్చినట్టుగానే ఇనాయ ఎలిమినేట్ అవ్వబోతోందా.. లేదా సేఫ్ అయ్యి టాప్ 5 లోకి వెళ్తుందా అనేది చూడాలి.. ఈ వారం ఓటింగ్ కి ఇదే చివరి రోజు అవ్వడంతో ఇనాయ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేయాల్సిందిగా అందరిని కోరుకుంటున్నారు.. ఒకవేళ ఇనాయ ఎలిమినేషన్ జరిగితే మాత్రం వచ్చే సీజన్ మీద కూడా ఆ ప్రభావం గట్టిగానే పడే అవకాశం ఉంది..చూడాలి మరి ఈ వారం ఏమి జరగబోతుంది అనేది .