
Hero – Heroien Kiss : ఒకప్పుడు అంటే సినిమాల్లో హీరో హీరోయిన్లు ముద్దు పెట్టుకునే సన్నివేశాలు వచ్చినప్పుడు, పడకగది సన్నివేశాలు వచ్చినప్పుడు రెండు పువ్వులు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్టు, రెండు రామచిలుకలు ఒకదాని ముక్కు మరొకటి దొరికినట్టు చూపించేవారు. ఇంకా కొందరు దర్శకులు రసికతను మరింత గాఢంగా చూపించేందుకు పాలలో తేనె కలిసినట్టు, వర్షపు చినుకులు భూమి మీద పడ్డట్టు చూపించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. సాంకేతికత పెరిగింది.. అలాంటి రసికత కలిగిన సన్నివేశాలు వచ్చినప్పుడు నేరుగానే చూపిస్తున్నారు. కౌగిలింతలు, ముద్దు సన్నివేశాలు, పడకగది సీన్స్ ఎటువంటి మొహమాటం లేకుండానే ప్రదర్శిస్తున్నారు.. సెన్సార్ బోర్డు కూడా ఉదారత చూపుతుండడంతో ఇంటిమేట్ సీన్లకు కొదవ లేకుండా పోతోంది.
వాస్తవానికి ఇంటిమేట్ సీన్లలో నటించేందుకు ఒకప్పుడు హీరో హీరోయిన్లు భయపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. ఎంత విప్పి చూపిస్తే అంత ఫాలోయింగ్ అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇక ఇతర ప్రాంతాల నుంచి హీరోయిన్లు తెలుగు చిత్ర పరిశ్రమకు దిగుమతి అవుతుండడంతో దర్శకుల పంట పండుతోంది. హీరోల గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమాకు ముందే ఇంటిమేట్ సీన్లు ఉంటాయని దర్శకులు ఘంటాపదంగా చెబుతున్నారు. కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ ఇస్తుండడంతో హీరోయిన్లు కూడా పెద్దగా అడ్డు చెప్పడం లేదు. పైగా సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగిన నేపథ్యంలో గ్లామర్ పేరుతో కురచ దుస్తులు వేసుకుంటూ అందాల ప్రదర్శన చేస్తున్నారు. కెమెరా ముందైతే చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే చాలావరకు ఇంటిమేట్ సీన్లు లైవ్ గా చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ సిగ్గు బిడియం ఉన్న నటీనటులు అలాంటి సన్నివేశాలకు ఒప్పుకోరు.. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా అసలు పట్టించుకోరు.. ఇలాంటి సన్నివేశాలు తీయడం అనివార్యం అయితే వాటిని కంప్యూటర్ గ్రాఫిక్స్ లో రూపొందించి అచ్చం ముద్దు పెట్టుకున్నట్టుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.. ఆమధ్య తమిళ హీరో సూర్య ద్వి పాత్రాభినయం చేసిన బ్రదర్స్ అనే సినిమా విడుదలైంది. అందులో కాజల్ హీరోయిన్. ఒక సన్నివేశంలో సూర్యకు కాజల్ ముద్దు పెట్టాల్సి వస్తుంది.. ఇది సూర్యకు ఇష్టం లేదు.. అటుపోతే దర్శకుడి మాట కాదనలేడు. దీంతో ఆ సన్నివేశాన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ లో చిత్రీకరించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించినందుకు ఎలాంటి ప్రయోగాలు చేశారో చిత్ర యూనిట్ మేకింగ్ వీడియో విడుదల చేయడంతో… అందరికీ ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది. మన కళ్ళ ముందు కనిపించే ముద్దు సన్నివేశాల వెనుక ఇంత తతంగం ఉందా అంటూ నోరు వెళ్లబెట్టడం నెటిజెన్లవంతయింది.