https://oktelugu.com/

Hyper Adi – Pawan : ఇది ఎవడ్రా రాసింది.. పవన్ కళ్యాణ్ ను అన్నందుకు సీరియస్ అయిన హైపర్ ఆది

Hyper Adi – Pawan : అందరు హీరోలకు అభిమానులు ఉంటారు. పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులు ఉంటారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సైతం ఇటీవల స్వయంగా అన్నారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న కోట్లాది భక్తుల్లో హైపర్ ఆది ఒకరు. పవన్ కళ్యాణ్ ని అమితంగా ప్రేమించే వ్యక్తిగా ఆయన ఆలోచనలు, భావజాలాన్ని కూడా అనుసరిస్తారు. హైపర్ ఆది పవన్ కళ్యాణ్ నికార్సైన ఫాలోవర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పవన్ కళ్యాణ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 13, 2023 / 09:43 PM IST
    Follow us on

    Hyper Adi – Pawan : అందరు హీరోలకు అభిమానులు ఉంటారు. పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులు ఉంటారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సైతం ఇటీవల స్వయంగా అన్నారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న కోట్లాది భక్తుల్లో హైపర్ ఆది ఒకరు. పవన్ కళ్యాణ్ ని అమితంగా ప్రేమించే వ్యక్తిగా ఆయన ఆలోచనలు, భావజాలాన్ని కూడా అనుసరిస్తారు. హైపర్ ఆది పవన్ కళ్యాణ్ నికార్సైన ఫాలోవర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పవన్ కళ్యాణ్ ని ఎవరు పల్లెత్తి మాటన్నా హైపర్ ఆది ఊరుకోడు. ఏదో ఒక రూపంలో వాళ్లకు కౌంటర్లు ఇస్తారు.

    ఇదే విషయం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో చర్చకు వచ్చింది. ఎంటర్టైన్మెంట్ లో భాగంగా షోలో చిన్న గేమ్ కండక్ట్ చేశారు. అందరూ ఒక చీటీ తీసుకోండి. అందులో ఎవరైనా ఒకరిని మీరు అడగాలనుకుంటున్న ప్రశ్న రాయండి. మీ ఇష్టం ఏదైనా అడగొచ్చు. ఎందుకంటే చీటీలో మీ పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అన్ని చీటీలు చుట్టి ఒక గాజు కూజాలో వేశారు. ఒకరు హైపర్ ఆదికి ప్రశ్న రాశారు. ”హైపర్ ఆది అన్నయ్య పవన్ కళ్యాణ్ కోసం ఎవరినైనా ఎదిరిస్తావా?” అని చీటీలో రాశారు.

    దానికి హైపర్ ఆది ఎవడ్రా ఇది రాసిందని ఫైర్ అయ్యాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కోసం వెనక్కి తగ్గేది లేదని తన మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి కోసం ఎంత వరకైనా వెళతానని చెప్పాడు. హైపర్ ఆది పూర్తిగా ఏం చెప్పాడో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సి ఉంది. ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

    కాగా జనసేన పార్టీలో కూడా హైపర్ ఆది క్రియాశీలకంగా ఉంటున్నారు. రణస్థలం వేదికగా జరిగిన జనసేన యువగర్జన సభలో తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున హైపర్ ఆది పోటీ చేయనున్నాడట. ఏపీలో తన సొంత జిల్లా ప్రకాశం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడట. ఈ మేరకు జనసేన హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇక నటుడిగా, రచయితగా, బుల్లితెర స్టార్ గా హైపర్ ఆది సత్తా చాటుతున్నారు.

    వీడియో లింక్