
Pawan Kalyan- Laya: పవన్ కళ్యాణ్ ఔన్నత్యాన్ని హీరోయిన్ లయ కొనియాడారు. నా వివాహానికి ఆయన వస్తారని అసలు ఊహించలేదని పవన్ ఇచ్చిన షాకింగ్ సర్ప్రైజ్ గుర్తు చేసుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ గారితో నేను నటించలేదు. అయినా నా గురించి ఆయనకు తెలిసే ఉంటుందన్న ఉద్దేశంతో కలిసి పెళ్ళికి ఆహ్వానించాను. అపాయింట్మెంట్ లేకపోయినా కలిశారు. చాలా సేపు మాట్లాడారు. పెళ్లి పత్రిక తీసుకొని కచ్చితంగా వస్తానని చెప్పారు. నాకు నమ్మకం కుదర్లేదు. ఏదో ఫార్మాలిటీకి చెప్పారనుకున్నాను.
కట్ చేస్తే అందరికంటే ముందు పెళ్లికి హాజరయ్యారు. నేను షాక్ తిన్నాను. ఆయన వస్తారనే ఉద్దేశం లేకపోవడంతో మంచిగా ఏర్పాట్లు చేయలేదు. మర్యాదలు చేయలేకపోయాము. ఆయన చాలా సింపుల్ గా వచ్చారు. అన్నయ్యను కూడా ఆహ్వానించారు కదా, దారిలో ఉన్నారు వస్తున్నారని చెప్పారు. పెళ్ళికి వచ్చినందుకు థాంక్స్ చెప్పాను. చిరంజీవి గారంటే ఇండస్ట్రీ పెద్ద, నాతో పరిచయం ఉంది. ఆయన రావడంలో ఒక అర్థం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి నా ఆహ్వానం గుర్తు పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. పవన్ మనసు అంత గొప్పది అంటూ… లయ ప్రశంసలు కురిపించారు.
విజయవాడకు చెందిన లయ స్వయంవరం మూవీతో పరిశ్రమలో హీరోయిన్ గా అడుగుపెట్టారు. ప్రేమించు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 2006లో లయ వివాహం చేసుకొని పరిశ్రమకు దూరమయ్యారు. అమెరికాలో డాక్టర్ గా స్థిరపడిన గణేష్ గోర్తి ని ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. అమ్మాయి శ్లోక గోర్తి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

లయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో కమ్ బ్యాక్ ఇచ్చారు. హీరోయిన్ తల్లిగా చిన్న పాత్ర చేశారు. ఇదే మూవీలో కూతురు శ్లోక చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేశారు. కూతురిని హీరోయిన్ చేయాలని లయ తన కోరిక బయటపెట్టారు. అయితే నేను తనని బలవంత పెట్టను. హీరోయిన్ అవుతానంటే ప్రోత్సహిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం శ్లోక 9వ తరగతి చదువుతుందట. చూసిన వాళ్ళు మీ చెల్లెలా అని అడుగుతున్నారట. మరి అమ్మ మాదిరి శ్లోక సిల్వర్ స్క్రీన్ మీద తన మార్క్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.