Actress Laya : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ అనేది చాలా తక్కువ కాలం పాటు ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. వాళ్లకి ఒక సక్సెస్ వచ్చిందంటే మరొక నాలుగు సినిమా ఆఫర్లైతే వస్తాయి. ఆ నాలుగు సినిమాల్లో మరొక రెండు సినిమాలు సక్సెస్ అయితేనే వాళ్ళ కెరీర్ అనేది ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు నిలబడగలుగుతుంది. లేకపోతే మాత్రం వాళ్ళు ఫేడౌట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి లయ(Laya)… ఆమె సినిమాలను వదిలేసి పెళ్లి చేసుకొని అమెరికా లో సెటిలైపోయారు. అయినప్పటికి సోషల్ మీడియా ద్వారా రీల్స్ చేస్తూ ప్రేక్షకులందరిని అలరించడానికి ఆవిడ మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా స్టార్ట్ చేసి కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆమె చేస్తున్న సినిమాల విషయం పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో అమెరికా కంటే హైదరాబాద్ చాలా బెటర్ అయిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్ ఇలా ఉండేది కాదు ఇప్పుడు చాలా గొప్పగా మారిపోయింది. అమెరికాను తలదన్నేలా బిల్డింగ్ ను నిర్మించారు. హైదరాబాద్ ముందు న్యూయార్క్ నగరం ఎందుకు పనిచేయదు అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోని చూసిన కొంత మంది మాత్రం హైదరాబాదులో ఏం మారింది అంటూ కొన్ని నెగిటివ్ కామెంట్లు చేసినప్పటికి ఆమె మాట్లాడిన మాటలు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…
ఒకప్పుడు హీరో వేణు(Venu), శివాజీ(Shivaji) లాంటి వాళ్ళతో నటించి మెప్పించిన లయ ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటం చూస్తున్న ప్రతి ఒక్కరు గొప్పగా ఫీల్ అవుతున్నారు. చాలామంది హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిపోయి హైదరాబాద్ కంటే అమెరికా చాలా బెటర్ గా ఉంది అంటూ వాళ్ళ ఒపీనియన్ ని చెబుతూ ఉంటారు.
కానీ లయ మాత్రం దానికి భిన్నంగా మన హైదరాబాద్ ను పొగుడుతూ మాట్లాడటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకర్షించిందనే చెప్పాలి. ఇక ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి సినిమాలు చేస్తూ మరోసారి తన స్టామినాను చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మొత్తానికైతే ఆమె సినిమా ఇండస్ట్రీలోనే ఉండడం ఆమెకు చాలా ఇష్టం అని తన లక్కును పరీక్షించుకోడానికి సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టాలని కూడా తను చెప్పడం విశేషం… మరి తననుకున్నట్టుగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరోసారి ఆమె తన సత్తాను చాటుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
హైదరాబాద్ అంటే @KTRBRS pic.twitter.com/Yhxf8aDVtc
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) January 30, 2025