
Hansika Divorce: బాలనటిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత సౌత్ లోనే టాప్ స్టార్ గా ఎదిగిన హీరోయిన్స్ లో ఒకరు హన్సిక.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘దేశముదురు’ అనే సూపర్ హిట్ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.ఆ తర్వాత వరుసగా ఈమె స్టార్ హీరోల సరసన నటిస్తూ అనతి కాలం లోనే ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది.
ముఖ్యంగా తమిళ సినీ ఇండస్ట్రీ లో ఈమెకి ఉన్న క్రేజ్ మరియు డిమాండ్ మామూలుది కాదు.కుర్రకారులు ఇప్పటికీ హన్సిక అంటే మెంటలెక్కిపోతారు.అక్కడ దాదాపుగా స్టార్ హీరోలందరితో కలిసి నటించిన హన్సిక టాలీవుడ్ లో అల్లు అర్జున్ , ఎన్టీఆర్ మరియు ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించింది.ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈమె సోహైల్ ఖాతూరియా అనే అతనిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
సోహైల్ ఖాతూరియా మరెవరో కాదు, హన్సిక ప్రాణ స్నేహితురాలి ప్రేమికుడు.అలా స్నేహితురాలి ప్రేమికుడిని పెళ్లి చేసుకోవడానికి సిగ్గు లేదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చాలా కామెంట్స్ చేసారు.కానీ అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తుంది.అయితే ఈమధ్య ఈమె తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తనకి సంబంధించిన హాట్ ఫోటోలు మరియు వీడియోలను అప్లోడ్ చేస్తుంది.

పెళ్లి కానీ అమ్మాయి సినిమా అవకాశాల కోసం ఎలాంటి ఫోటోలు అప్లోడ్ చేస్తుందో అలాంటి ఫోటోలను హన్సిక కూడా అప్లోడ్ చేస్తుంది.భర్త సోహైల్ కి ఇది ఏమాత్రం ఇష్టం లేదట.ఇలాంటివి ఇష్టం లేదు, ఒద్దు అని చెప్పినా కూడా హన్సిక మాట వినకుండా ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉందట.దీనిపై తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయి, రీసెంట్ గా జరిగిన ఒక గొడవ విడాకుల వరకు దారి తీసేలా ఉందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.మరి ఈ వార్తలపై హన్సిక స్పందిస్తుందో లేదో చూడాలి.