Homeఎంటర్టైన్మెంట్Actress Divyavani: వాళ్లడిగింది చేయనందుకే హీరోయిన్‌ చాన్స్‌ ఇవ్వలేదు.. బాపుబొమ్మ సంచలన ఆరోపణ

Actress Divyavani: వాళ్లడిగింది చేయనందుకే హీరోయిన్‌ చాన్స్‌ ఇవ్వలేదు.. బాపుబొమ్మ సంచలన ఆరోపణ

Actress Divyavani: క్యాస్టింగ్‌ కౌచ్‌ నాలుగైదేళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపింది. లారాదత్త వంటి పెద్దపెద్ద హీరోయిన్లు కూడా తాము కూడా కాస్టింగ్‌ కౌచ్‌బాధితులమే అని గళమెత్తారు. దీంతో చాలామంది దీనిపై స్పందించారు. తాము ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వేధింపులను బయటపెట్టారు. అయితే నాడు నోరు మొదపని కొంతమంది హీరోయిన్లు ఇప్పుడు దానిగురించి మాట్లాడుతున్నారు. నయనతార ఇటీవల దీనిపై మాట్లాడారు. తాను తనను కూడా కొందరు అడిగారని సంచలన కామెంట్స్‌ చేశారు. కానీ తనకు నచ్చని పని చేయనని చెప్పానని తెలిపారు. తన టాలెంట్‌ ఆధారంగానే అవకాశాలు వచ్చాయిన చెప్పారు. తాజాగా బాపు బొమ్మగా గుర్తింపు పొందిన అలనాటి హీరోయిన్‌ దివ్వవాణి ఇండస్ట్రీలో నాటి పరిస్థితులపై స్పందించారు. వాళ్లు అడిగింది చేయనందుకే తనకు హీరోయిన్‌గా చాన్స్‌ ఇవ్వలేదని తెలిపారు.

Actress Divyavani
Actress Divyavani

బాపు బొమ్మగా గుర్తింపు..
దివ్యవాణి.. ఈ హీరోయిన్‌ ఇప్పుడు జనరేషన్‌ వాళ్లకు తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో డైరెక్టర్‌ బాపు సినిమా వస్తుందంటే చాలు కచ్చితంగా ఆ సినిమాలో బాపు బొమ్మలాంటి దివ్యవాణి ఉండాల్సిందే. ఇక బాపు బొమ్మ లాంటి ఈమె అందమైన రూపం చూసి డైరెక్టర్‌ బాపు తన ప్రతి సినిమాలో ఈ హీరోయిన్‌ నే తీసుకునేవారు. దీంతో దివ్యవాణి బాపు హీరోయిన్‌ గా మారిపోయింది. అచ్చ తెలుగు అమ్మాయిలాగా ఉండే దివ్యవాణి రూపం అప్పట్లో అందరిని అట్రాక్ట్‌ చేసింది.

బాలనటిగా ఇండస్ట్రీలోకి..
ఇక దివ్యవాణి మొదట బాలనాటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్‌గా మారి కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక దివ్యవాణి నటించిన పెళ్లి పుస్తకం సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. అందచందాలు బాగున్నప్పటికీ హీరయిన్‌గా మాత్రం తక్కువ సినిమాల్లో చేసి సక్సెస్‌ అవ్వలేకపోయింది. పెళ్లి పుస్తకం సినిమా ఈమె కెరియర్‌ లోనే చెప్పుకోదగిన సినిమాగా పేరు వచ్చింది.

బాపు సినిమాల్లో చాన్స్‌..
ప్రముఖ దర్శకుడు బాపు సినిమాల్లో హీరోయిన్‌ అవకాశం రావడం అరుదు. కానీ దివ్వవాణికి ఆ చాన్స్‌ మూడుసార్లు దక్కింది. వరుసగా మూడు సినిమాల్లో బాపు దివ్యవాణికి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. మిస్టర్‌ పెళ్లాం అనే సినిమాలో హీరోయిన్‌గా మొదట ఈమెకే అవకాశం వచ్చిందట. కానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా చివరికి వేరే హీరోయిన్‌ తీసుకున్నారు. ఆ టైంలో తనకు అవకాశం ఇవ్వండి అని కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడినా చిత్రం యూనిట్‌ పక్కన పెట్టిందని తాజాగా దివ్యవాని తెలిపారు.

Actress Divyavani
Actress Divyavani

ఇగోలకు బలి..
ఆ టైంలో కొంతమంది ఇగోలకు తాను బలవ్వాల్సి వచ్చిందని దివ్యవాణి తెలిపారు. దానికి ప్రధాన కారణం వాళ్లు అడిగిన దానిని నేను కాదనకడమే అన్నారు. ఎందుకంటే వాళ్లు చేయమన్న పని చేయడానికి తాను రెడీగా లేనన్నారు. అందుకే తనను మిస్టర్‌ పెళ్లాం సినిమాలో హీరోయిన్‌గా తీసేశారని చెప్పారు. అందం అభినయం ఉన్నా హీరోయిన్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోకపోవడానికి వారు అడిగింది చేయకపోవడమే కారణమని అర్థమైందని తాజాగా ఓ ఇటర్వ్యూలో వెల్లడించారు. అయితే వాళ్లు ఏం అడిగారు… ఏం ఇవ్వలేదు అనే విషయం మాత్రం చెప్పలేదు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular