Hero Vijay vs Ajith : ‘నాకు నేనే పోటీ’ అంటూ అజిత్ పై సెటైర్లు వేసిన హీరో విజయ్

Hero Vijay vs Ajith : తమిళనాడు లో రజినీకాంత్ మరియు కమల్ హాసన్ తర్వాత అక్కడి ఇండస్ట్రీ కి రెండు కళ్ళు లాగ మారిన హీరోలు అజిత్ మరియు విజయ్..మన టాలీవుడ్ లో ఎన్టీఆర్ – ఏఎన్నార్, కృష్ణ – శోభన్ బాబు , చిరంజీవి – బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు ఇలా ఎలా అయితే వాళ్ళ జనరేషన్స్ తో టాప్ 2 స్టార్స్ గా కొనసాగారో , తమిళనాడు అజిత్ […]

Written By: NARESH, Updated On : December 25, 2022 8:31 pm
Follow us on

Hero Vijay vs Ajith : తమిళనాడు లో రజినీకాంత్ మరియు కమల్ హాసన్ తర్వాత అక్కడి ఇండస్ట్రీ కి రెండు కళ్ళు లాగ మారిన హీరోలు అజిత్ మరియు విజయ్..మన టాలీవుడ్ లో ఎన్టీఆర్ – ఏఎన్నార్, కృష్ణ – శోభన్ బాబు , చిరంజీవి – బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు ఇలా ఎలా అయితే వాళ్ళ జనరేషన్స్ తో టాప్ 2 స్టార్స్ గా కొనసాగారో , తమిళనాడు అజిత్ – విజయ్ అలాగా..వీళ్లిద్దరికీ అక్కడ సరిసమానమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

కానీ ఈమధ్య కాలం లో అజిత్ కంటే విజయ్ కి వరుస హిట్స్ పడ్డాయి..విజయ్ సరైన క్రేజీ కాంబినేషన్స్ తో సినిమాలు తీస్తూ రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ మార్కెట్ ని బాగా పెంచుకున్నాడు..తెలుగు లో కూడా ఆయనకి మంచి మార్కెట్ ఏర్పడింది..ఈ విషయం లో అజిత్ బాగా వెనుకపడ్డాడు..తమిళనాడు లో సరిసమానమైన మార్కెట్ ఉన్నప్పటికీ, మిగిలిన ప్రాంతాలలో విజయ్ మార్కెట్ అజిత్ కంటే మూడు రేట్లు పెరిగింది.

ఇప్పుడు వీళ్లిద్దరు హీరోలుగా నటించిన ‘తునీవు’, ‘వారిసు’ చిత్రాలు జనవరి 12 వ తేదీన విడుదల కాబోతున్నాయి..అజిత్ నటించిన ‘తునీవు’ చిత్రం తెలుగు లో ‘తెగింపు’ అనే పేరుతో విడుదల చేస్తుండగా, ‘వారిసు’ చిత్రాన్ని ‘వారసుడు’ పేరు తో విడుదల చేస్తున్నారు..వారిసు చిత్రాన్ని మన తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించాడు..నిన్న చెన్నై లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడిన కొన్ని మాటలు వివాదాస్పదం గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘నేను ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో నాకు ఒకరు పోటీగా ఉండేవాడు..రోజులు గడుస్తుందే కొద్దీ అతను నాకు మరింత సీరియస్ పోటీని ఇచ్చాడు..చివరికి అతనిని నేను జయించాను..నాకు పోటీ వచ్చింది మరెవరో కాదు..అది కూడా నేనే’ అంటూ విజయ్ చేసిన కామెంట్స్ కి అటు అజిత్ ఫ్యాన్స్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.