Arjun Kapoor Malaika Arora : బాలీవుడ్ ఐటెం బాంబ్ ‘మలైకా అరోరా’ వయసు 48 ఏళ్ళు. అయితే, ఈ వయసులోనూ ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని ఈ భారీ బ్యూటీ ప్రతి రోజు వ్యాయామాల పేరుతో హాట్ హాట్ ఫోజులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక చాలా కాలంగా అర్జున్ కపూర్ తో సహా జీవనం కూడా చేస్తోంది మలైకా. వీరి రొమాన్స్ కి అడ్డు అదుపు లేదు. అన్నట్టు వీళ్ళు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారు అని తెలుస్తోంది.
పెళ్లి కాకపోయినా 37 ఏళ్ల అర్జున్ కపూర్ తో 49 ఏళ్ల మలైకా అరోరా చాలా కాలంగా సహా జీవనం చేస్తూ ఉంది. ఇప్పటికే వీరిద్దరి సహజీవనం గురించి బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తనకంటే పదేండ్లు చిన్న వాడితో మలైకా ఎఫైర్ పెట్టుకోవడం ఏంటని అంతా అంటున్నారు. అయినా వారు మాత్రం అవేవీ పట్టించుకోకుండా.. హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరు కూడా త్వరలోనే పెండ్లి చేసుకుంటారనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇక మలైకా మొదటి భర్త, సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్‌ఖాన్ కూడా జార్జియా ఆండ్రియాతో సహజీవనం చేస్తున్నాడంట. ఇలా బాలీవుడ్ లో మూడు ఎఫైర్లు.. ఆరు సహజీవనాలతో పెళ్లికి దూరంగా ఎంజాయ్ చేస్తున్నారు జంటలు.
తాజాగా మలైకా-అర్జున్ కపూర్ ల గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. చాలా రోజుల నుంచి డేటింగ్ చేస్తుండడంతో మలైకా ప్రస్తుతం గర్భవతి అని వార్తలొస్తున్నాయి. దీనిపై అర్జున్ కపూర్ స్పందించాడు.‘ఇలాంటి చెత్త వార్తలు రాయకండి.. మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకోకండి’ అంటూ మండిపడ్డారు.
ఇటీవలే వీరిద్దరూ సహజీవనానికి ముగింపు పలికి పెళ్లికి రెడీ అయ్యారని వార్తలు వచ్చాయి. కానీ మలైకా మాత్రం వీటిని కొట్టిపారేసింది. ఇలా పెళ్లి చేసుకోకుండా.. పిల్లలను కనకుండా ఈ జంట లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.