
Hello Brother Records: టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘హలో బ్రదర్’.అదేంటి కవలపిల్లల కాన్సెప్ట్ తో అప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చాయి కదా, ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ ఎలా అవుతుంది అని మీకు అనిపించొచ్చు.అలాంటి కథాంశాలతో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ కవలపిల్లలు ఒకేలా ప్రవర్తిస్తారు అనే కాన్సెప్ట్ తో ఒక్క సినిమా కూడా రాలేదు.హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘ట్విన్ డ్రాగన్’ అనే చిత్రాన్ని ఆధారంగా తీసుకొని డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ‘హలో బ్రదర్’ స్క్రిప్ట్ ని తెరకెక్కించాడు.
నాగార్జున హీరోగా రమ్య కృష్ణ , సౌందర్యాలు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా 1994 వ సంవత్సరం లో విడుదలై సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.ప్రముఖ కమెడియన్ LB శ్రీరామ్ ఈ చిత్రానికి మాటలు అందించాడు.కేవలం రెండు కోట్ల 50 లక్షల రూపాయిల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఆ రోజుల్లో ఎలాంటి రికార్డ్స్ ని నెలకొల్పిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ఈ చిత్రం ఆరోజుల్లో 30 కేంద్రాలలో 50 రోజులు మరియు 20 డైరెక్ట్ కేంద్రాలలో వంద రోజులను పూర్తి చేసుకొని సంచలనం సృష్టించింది,ఇక వసూళ్ల విషయానికి వస్తే ఆరోజుల్లోనే ఈ సినిమాకి 16 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.షేర్ లెక్కలోకి చూస్తే 8 కోట్ల 50 లక్షల రూపాయిలు వచ్చాయట.ఈ రేంజ్ వసూళ్లు అప్పట్లో కేవలం మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు మాత్రమే వచ్చాయి.

మరో కోటి 50 లక్షలు అదనంగా వసూలు చేసి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది.ఆరోజుల్లో నాగార్జున సినిమాలకు సరైన రిలీజ్ లు ఉండేవి కావట.అందుకే ఇండస్ట్రీ హిట్ ఛాన్స్ మిస్ అయ్యిందని అక్కినేని ఫ్యాన్స్ అంటుంటారు.ఇది ఇలా ఉండగా హైదరాబాద్ లో RTC క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ లో ఈ చిత్రం 120 రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడించిందట.అందులో 30 రోజులు నాన్ స్టాప్ గా నాలుగు ఆటలు ప్రతీ రోజు హౌస్ ఫుల్ అయ్యిందట.ఇలా ఎన్నో రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ‘హలో బ్రదర్’ చిత్రం.