
Keerthy Suresh: పెళ్లి తంతు పూర్తి కాగానే వరుడి స్నేహితులు బరాత్ చేసేందుకు రెడీగా ఉంటారు. వధూవరుల ఊరేగింపు కార్యక్రమం ఉన్నంతసేపు వివిధ సాంగ్ లతో డ్యాన్స్ చేస్తుంటారు. ఇందులో తీన్మార్ సౌండ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ తీన్మార్ లో కుర్రాళ్లు ప్రత్యేకమైన స్టెప్పులు వేసి ఆకట్టుకుంటారు. అయితే ఈ తీన్మార్ ను అమ్మాయిలు చేస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ వాళ్లు చేయడానికి చాలా వరకు ముందుకు రారు. ‘దసరా’ సినిమాలో తీన్మార్ కు అమ్మాయిలు స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది? అదీ పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తే ఎలాగుంటుంది? అనే సన్నివేశాన్ని చూపించారు.
‘దసరా’ మూవీలో కీర్తి సురేష్ డీ గ్లామర్ గా కనిపించి ఆకట్టుకుంది. అచ్చం పల్లెటూరి అమ్మాయిలా వెన్నెల పాత్రలో కనిపించి అందరినీ ఇంప్రెస్ చేసింది. జానపదం గొలిపే సాంగ్స్ లో కీర్తి సురేష్ వేసిన స్టెప్పులతో యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కీర్తి సురేష్ పెళ్లి కూతురు గెటప్ లో చేసిన తీన్మార్ డ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణ ఆడపిల్ల డ్యాన్స్ చేస్తే ఎలాగుంటుందో కీర్తి సురేష్ అలాగే కనిపించింది.

నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది ‘దసరా’ మూవీ. ఊర మాస్ లెవల్లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్లలోనూ దూసుకుపోతుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వచ్చిన ‘దసరా’ మ్యూజికల్ గా నూ ఆకట్టుకుంటోంది. ఇందులోని పాటలన్నీ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ చేసిన తీన్మార్ డ్యాన్స్ కు ఆడియన్స్ షాక్ అయ్యారు. పెళ్లి కూతురు గెటప్ లో ఆమె చేసిన డ్యాన్స్ తో చాలా మంది స్పెషల్ వీడియోలు తీస్తున్నారు. కీర్తి సురేష్ చేసిన ఈ డ్యాన్స్ ను మాములుగా చేయలేదు. 30 వరకు టేక్ లు తీసుకొని స్టెప్పులను వేసిందట.
కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇందులో ఆమె చేసిన డ్యాన్స్ కు అంతా షాక్ అవుతున్నారు. ఈ సాంగ్ పై కొందరు రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అంతకుముందే ఆమె ఈ సాంగ్ కోసం స్టెప్పులు నేర్చుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోనూ మీరూ చూడండి.