
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా గా ‘హరి హర వీరమల్లు’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఏ ముహూర్తం లో ఈ సినిమా ప్రారంభం అయ్యిందో కానీ, అడుగడుగునా అడ్డంకులు మరియు షూటింగ్ బ్రేక్స్ వస్తూనే ఉన్నాయి.వకీల్ సాబ్ సినిమాతో పాటుగా సమాంతరంగా ‘హరి హర వీరమల్లు’ సినిమాని ప్రారంభించాడు పవన్ కళ్యాణ్.
రెండు సినిమాల షూటింగ్స్ లో చురుగ్గా పాల్గొనేవాడు.కానీ దురదృష్టం కొద్దీ కరోనా సెకండ్ వేవ్ రావడం తో ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ చాలా కాలం వరకు ఆగిపోయింది.ఆ తర్వాత మళ్ళీ తిరిగి షూటింగ్స్ ప్రారంభం అయ్యినప్పుడు ‘భీమ్లా నాయక్’ సినిమా ని ప్రారంభించాడు పవన్ కళ్యాణ్.దీనితో ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ మరికొన్ని రోజులు వాయిదా పడింది.అలా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా గత మూడు నెలల నుండి షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంది.

రామోజీ ఫిలిం సిటీ సుమారుగా రెండు నెలలపాటు ఇంటర్వెల్ సీన్ ని తెరకెక్కించారు.ఈ సన్నివేశం ఎంతో అద్భుతంగా వచ్చిందని ఫిలిం నగర్ లో ఒక టాక్ కూడా ఉంది.అలా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమా మొన్నటి వరకు ముంబై లో మరో సరికొత్త షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.పవన్ కళ్యాణ్ లేకుండా ఈ చిత్రం లో ఓరంగజేబు పాత్ర చేస్తున్న బాబీ డియోల్ మీద కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.అలా సాగిపోతున్న ఈ చిత్రం షూటింగ్ కి మరికొన్ని రోజులు బ్రేక్ పడినట్టు సమాచారం.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన డేట్స్ మొత్తాన్ని వినోదయ్యా సీతం రీమేక్ కి మరియు #OG చిత్రానికి కేటాయించాడట.
ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి అయ్యాక ఆయన రాజకీయ పర్యటన చెయ్యబోతున్నాడు.ఇదంతా చూస్తూ ఉంటే ఇప్పట్లో ఈ సినిమా వచ్చేలా కనిపించడం లేదు.మరో పక్క నిర్మాత AM రత్నం ఫైనాన్షియర్స్ దగ్గర అప్పులు ఎక్కువ అయిపోతున్నాయి, వడ్డీలు పెరిగిపోతున్నాయని పవన్ కళ్యాణ్ మీద అసహనం తో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
