Hari Hara Veera Mallu Teaser: పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడిక్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా సాగుతుంది..ఇప్పటికే 50 శాతం షూటింగ్ కి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మిగిలిన భాగం అతి త్వరలోనే పూర్తి చేసి సమ్మర్ కానుగ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు డైరెక్టర్ క్రిష్ ప్రయత్నం చేస్తున్నాడు..మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా నటిస్తున్నాడు.

ఆయనకీ జోడిగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ ఇందులో ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నాడు..ఇటీవలే ఆయన షూటింగ్ లో పాల్గొన్నాడు కూడా..వీరమల్లు మరియు ఓరంగజేబు మధ్య రాజా దర్బార్ లో వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాలను ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరిస్తున్నారు..ఇది ఇలా ఉండగా అభిమానులకు ఈ ఆదివారం ఈ సినిమా గురించి ఒక శుభవార్త వినబోతున్నారని టాక్ వినిపిస్తుంది.
అసలు విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించిన సరికొత్త టీజర్ ని జనవరి 26 వ తేదీన రిపబ్లిక్ డే ని పురస్కరించుకొని విడుదల చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది..రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ యాక్షన్ టీజర్ అభిమానులకు పూనకాలు రప్పించేలా చేస్తుందట..పవన్ కళ్యాణ్ ఈ టీజర్ లో గడ్డం లుక్ లో కనిపిస్తాడు..అయితే ఈ టీజర్ ని డిసెంబర్ 31 వ తారీఖున విడుదలైన ఖుషి రీ రిలీజ్ సమయంలోనే అటాచ్ చేసి విడుదల చేద్దాం అనుకున్నారు.

కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ పెండింగ్ పడడంతో జనవరి 26 వ తేదీన విడుదల చేస్తామని నిర్మాత AM రత్నం ప్రకటించాడు..దానికి సంబంధించి ఒక అదిరిపొయ్యే పోస్టర్ ని ఈ ఆదివారం రోజు విడుదల చెయ్యబోతున్నారు..అంతే కాకుండా ఈ టీజర్ ‘వాల్తేరు వీరయ్య’ మూవీ థియేటర్స్ లో కూడా ప్రదర్శించడానికి చూస్తున్నారట.