
Swiggy Ramadan: మామూలు రోజుల్లోనే బిర్యానీని హైదరాబాద్ వాసులు లొట్టలు వేసుకుంటూ లాగించేస్తారు.. నేరుగా హోటల్ కు వెళ్లి తినేవారు ఎందరు ఉంటారో…అన్ లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేవాళ్లు కూడా అదే స్థాయిలో ఉంటారు. గల్లీకి ఒక రెస్టారెంట్ వెలిసినప్పటికీ హైదరాబాద్ వాసుల బిర్యాని ఆకలి తీరడం లేదు. అంతగా ఫేమస్ అయిపోయింది ఆ వంటకం. పైగా కొత్త కొత్త బిర్యానీలను హోటళ్ళు సర్వ్ చేస్తుండడంతో హైదరాబాద్ నగరవాసులు పుష్టిగా తింటున్నారు. ఇక ఈద్ సందర్భంగా అయితే బిర్యానీ రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయింది..ఇక హలీం కూడా దాని రికార్డ్ బ్రేక్ చేయకపోయినప్పటికీ దాని బాటనే అనుసరించింది.
ప్రఖ్యాత అన్ లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ కి ఆర్డర్లు మోతెక్కి పోయాయి. రంజాన్ నెల ప్రారంభం నుంచి ముగింపు(ఈద్ పండగ దాకా) వరకు హైదరాబాద్ వాసులు స్విగ్గి కి కాసుల పంట పండించారు. బిర్యాని, హలీం లను భారీగా ఆర్డర్ చేసుకున్నారు. మిలియన్ ప్లేట్ల బిర్యానీ, 4 లక్షల ప్లేట్ల హలీం ను అన్ లైన్ ద్వారా కొనుగోలు చేశారు. ప్యారడైజ్, బావర్చి, పిస్తా హౌస్, షా అండ్ గౌస్ కేఫ్, ఇలా అని పేరుపొందిన హోటల్స్ మాత్రమే కాకుండా, మిగతా వాటిల్లో కూడా ఆర్డర్స్ ఇచ్చి తమ జిహ్వను సంతృప్తి పరచుకున్నారు.

స్విగ్గి లోనే ఇలా ఉంటే… జొమాటో, ఉబర్ ఫుడ్స్ లో ఆర్డర్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటినీ కలిపితే ఈ లెక్క ఇంకా ఎక్కువగానే ఉంటుంది.. టైమ్స్ నౌ అంచనా ప్రకారం రంజాన్ నెలలో 650 కోట్ల వరకు హలీం వ్యాపారం జరిగిందని తెలుస్తోంది.. ఇక బిర్యానీ అయితే లెక్కే ఉండదని సమాచారం.. గతంలో హలీం కొన్ని హోటల్స్ మాత్రమే సర్వ్ చేసేవి. ఇప్పుడు పేరుపొందిన ప్రతి హోటల్ హలీం తయారు చేస్తుండటంతో జనం లొట్టలు వేసుకుంటూ తింటున్నారు.. రంజాన్ ఉపవాసం ఉండే వారు మాత్రమే కాకుండా.. మిగతావారు కూడా హలీం ఇష్టంగా తినడం మొదలుపెట్టారు.. దీనికి బిర్యానీ కూడా తోడు కావడంతో విక్రయాలు జోరుగా సాగాయి.. గత మూడు సంవత్సరాలు కోవిడ్ భయాలు ఉండటంవల్ల వ్యాపారం మామూలుగా సాగింది. కానీ ఈ ఏడాది ఆ భయాలు లేకపోవడంతో బిర్యాని, హలీమ్ వ్యాపారం జోరుగా సాగింది.
హలీం లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉండటంవల్ల దానిని తినేందుకు జనం మొగ్గు చూపించారు.. బిర్యానీ కూడా హైదరాబాద్ ఫేవరెట్ డిష్ కావడంతో దానిపై కూడా మరింత మక్కువ ప్రదర్శించారు.. ఈ నెలలో రోజా ఉండే వారికోసం ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో కొన్ని కొన్ని హోటల్స్ 24 గంటలు హలీం, బిర్యాని సర్వ్ చేశాయి. దీంతో ఫుడ్ డెలివరీ సంస్థలు రౌండ్ ది క్లాక్ పనిచేశాయి. అందుకే ఈ స్థాయిలో ఆర్డర్లు వచ్చాయని చెబుతున్నాయి.
View this post on Instagram