https://oktelugu.com/

Rajamouli : రాజమౌళిని చూసి ఈర్ష్య పడి పంతంతో భారీ సినిమా తీసాడు..పాపం ఆ డైరెక్టర్ పరిస్థితి ఇదీ

Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి నేడు ఈ స్థానం లో ఉన్నదంటే కారణం ఆయన విజన్.ప్రతీ ఒక్కరికీ అద్భుతమైన కలలు వస్తుంటాయి, ఆ కలలకు రూపం ఇస్తే అది సినిమా అవుతుంది.రాజమౌళి కి తన ఊహల్లో వచ్చే ప్రతీ ఒక్కటి స్క్రిప్ట్ పేపర్ మీద పకడ్బందీగా వచ్చే వరకు నిద్రపోడు.ఇక సెట్స్ లోకి వెళ్లిన తర్వాత తాను ఎలా అయితే అనుకున్నాడో, అలా తీయాల్సిందే.లేకపోతే అసలు నిద్ర కూడా పోడు.ఎన్ని షాట్స్ అయినా ఓపికగా చేస్తాడు, అలా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 15, 2023 / 09:49 PM IST
    Follow us on

    Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి నేడు ఈ స్థానం లో ఉన్నదంటే కారణం ఆయన విజన్.ప్రతీ ఒక్కరికీ అద్భుతమైన కలలు వస్తుంటాయి, ఆ కలలకు రూపం ఇస్తే అది సినిమా అవుతుంది.రాజమౌళి కి తన ఊహల్లో వచ్చే ప్రతీ ఒక్కటి స్క్రిప్ట్ పేపర్ మీద పకడ్బందీగా వచ్చే వరకు నిద్రపోడు.ఇక సెట్స్ లోకి వెళ్లిన తర్వాత తాను ఎలా అయితే అనుకున్నాడో, అలా తీయాల్సిందే.లేకపోతే అసలు నిద్ర కూడా పోడు.ఎన్ని షాట్స్ అయినా ఓపికగా చేస్తాడు, అలా జక్కనలాగా చెక్కుతాడు కాబట్టే ఆయన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తాయి.

    చెక్కడం వేరు, జనరంజకంగా సినిమాలను తీర్చి దిద్దడం వేరు.రాజమౌళి ఈ రెండిట్లో సిద్ధహస్తుడు.పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా, రాజమౌళి ని చూసి చాలా మంది డైరెక్టర్స్ వాతలు పెట్టుకున్నారు.వారిలో డైరెక్టర్ గుణశేఖర్ కూడా ఒకడు.ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లెజండరీ దర్శకుడే, అందులో ఎలాంటి సందేహం లేదు.

    అయితే రీసెంట్ గా ఈయన రాజమౌళి గురించి చెప్పిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.ఆయన మాట్లాడుతూ ‘బాహుబలి,ఈగ , మగధీర వంటి సినిమాలను తీసిన రాజమౌళి ని చూసి నాకు చాలా అసూయ కలిగింది.ఎలా ఈయన ఇంత అద్భుతంగా సినిమాలను తీయగలుగుతున్నాడు, ఈయనే కాదు నేను కూడా తీయగలను, అతను చేసే రిస్క్స్ నేను కూడా చెయ్యగలను అనుకోని నేను కూడా అలాంటి సినిమాలు తీసాను’ అంటూ చెప్పుకొచ్చాడు గుణశేఖర్.అయితే గుణశేఖర్ భారీ బడ్జెట్ సినిమాలను అయితే తీసాడు కానీ, రాజమౌళి లాగా జనరంజకంగా , క్వాలిటీ తో సినిమాలను రాబట్టుకోలేకపోయాడు.

    తీసిన సినిమాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.ఒక్క రుద్రమదేవి అనే సినిమా తప్ప ఇతను తీసిన భారీ బడ్జెట్ సినిమాలన్నీ బోల్తా కొట్టేశాయి. ఇక రీసెంట్ గా విడుదలైన సమంత ‘శాకుంతలం’ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.ఇలా ఒకరిని చూసి వాతలు పెట్టుకునే బదులు, వారిలాగా క్వాలిటీ సినిమా ఎలా తియ్యాలో నేర్చుకో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ గుణశేఖర్ పై సెటైర్లు వేస్తున్నారు.