Mahesh Rajamouli : మహేష్ – రాజమౌళి సినిమా పై ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయ్యే న్యూస్

Mahesh Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం డైరెక్టర్ రాజమౌళి తో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే..అభిమానులు మరియు ప్రేక్షకులతో పాటు మహేష్ బాబు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు..అయితే మహేష్ లైనప్ మరియు రాజమౌళి లైనప్ బిజీ అవ్వడం తో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది..చివరికి #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. #RRR […]

Written By: NARESH, Updated On : December 4, 2022 9:11 pm
Follow us on

Mahesh Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం డైరెక్టర్ రాజమౌళి తో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే..అభిమానులు మరియు ప్రేక్షకులతో పాటు మహేష్ బాబు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు..అయితే మహేష్ లైనప్ మరియు రాజమౌళి లైనప్ బిజీ అవ్వడం తో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది..చివరికి #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది.

#RRR సినిమా కి పాన్ ఇండియా రేంజ్ లోనే కాదు..పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రేక్షకుల నుండి అశేషమైన ఆదరణ లభించింది..మన తెలుగు సినిమాకి పాన్ వరల్డ్ మార్కెట్ ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం..మహేష్ కి సరైన సమయం లో రాజమౌళి తో సినిమా పడిందని..ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రపంచం లో ఉన్న అన్ని బాషలలో ఏకకాలం లో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇక ఈ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి తండ్రి చెప్పిన ఒక లేటెస్ట్ న్యూస్ మహేష్ ఫ్యాన్స్ ని పండుగ చేసుకునేలా చేస్తుంది..ఆయన మాట్లాడుతూ ‘మహేష్ తో చెయ్యబొయ్యే సినిమా స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా పూర్తి అవుతుంది..వచ్చే ఏడాది మే లేదా జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాము..మహేష్ బాబు అద్భుతమైన నటుడు..ఏ పాత్రలో అయినా ఇమిడిపోయి నటించగలడు..ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగానే ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ తో మీ ముందుకు రాబోతున్నాము..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఇప్పటి వరుకు ఈ జానర్ మీద ఎవ్వరు సినిమాలు చెయ్యలేదు..మొట్టమొదటి ప్రయత్నం చేస్తున్నాం’ అంటూ విజయేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఇందులో హాలీవుడ్ టెక్నిషియన్స్ తో పాటు హాలీవుడ్ నటీనటులు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది..సుమారు 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది..ఎన్నో ఏళ్ళ నుండి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.